Site icon NTV Telugu

USA: బైడెన్ పరిపాలనలో కీలక స్థానాల్లో ఇండో అమెరికన్స్..

Joe Biden

Joe Biden

Over 130 Indian-Americans At Key Posts In Biden Administration: అమెరికాలో కీలక స్థానాల్లో భారతీయ-అమెరికన్లకు పాతినిథ్యం వహిస్తున్నారు. జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత 130 కన్నా ఎక్కువ మంది ఇండో అమెరికన్లు కీలక స్థానాల్లో నియమించబడ్డారు. అన్నింటి కన్నా ముఖ్యంగా భారత సంతతి మహిళ కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్ వంటి కీలక స్థానంలో ఉన్నారు. అమెరికాలో ఒక శాతం జనాభా ఉన్న ఇండో అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా.. గత ఎన్నికల్లో జోబైడెన్ చేసిన వాగ్ధానాన్ని నిలబెట్టుకున్నారు. గతంలో డోనాల్డ్ ట్రంప్ హయాంలో 80 మంది భారతీయ-అమెరికన్లు కీలక స్థానాల్లో ఉన్నారు. తాాజాగా జో బైడెన్ ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్, బరాక్ ఒబామా రికార్డులను బద్ధలు కొట్టారు. గతంలో బరాక్ ఒబామా తన ఎనిమిదేళ్ల పాలనలో 60 మందికి పైగా భారతీయ-అమెరికన్లను కీలక పదవుల్లో నియమించారు.

Read Also: Legends League Cricket 2022: క్రికెట్ అభిమానులకు పండగ.. భారత్‌లోని ఐదు నగరాల్లో లెజెండ్స్ మ్యాచ్‌లు

యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో డాక్టర్ అమీ బెరా, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్ వంటి భారతీయ – అమెరికన్లు ప్రాతినిథ్యం వహిస్తుండగా.. పలు రాష్ట్రాల్లో, ఫెడరల్ స్థాయిల్లో 40 మందికి పైగా భారతీయ -అమెరికన్లు ఎన్నికయ్యారు. దీంతో పాటు అమెరికా వ్యాప్తంగా ఉన్న 20 అగ్రశ్రేణి కంపెనీలకు భారతీయ-అమెరికన్లే సీఈఓలుగా ఉన్నారు. రొనాల్డ్ రీగల్ అధ్యక్ష కాలంలో మొదటిసారిగా ఇండో అమెరికన్ నియామకం జరగగా.. ఇప్పుడు జో బైడెన్ పరిపానలో దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్ లోనూ భారతీయులు కనిపిస్తున్నారు.

జో బైడెన్ సెనెటర్ గా ఉన్నప్పటి నుంచే ప్రవాస భారతీయులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. జో బైడెన్ కోటరీలో.. బైడెన్ ప్రసంగ రచయితగా వినయ్ రెడ్డి, కోవిడ్ 19 ప్రధాన సలహాదారుగా డాక్టర్ ఆశిష్ ఝా, వాతావరణ విధానంపై సలహాదారుగా సోనియా అగర్వాల్, క్రిమినల్ జస్టిస్ పై ప్రధాన సహాయకుడిగా చిరాగ్ బైన్స్, పర్సనల్ మేనేజ్మెంట్ ఆఫీస్ లో కీలక స్థానంలో కిరణ్ అహుజా ఉన్నారు. నీరా టాండెన్ బైడెన్ సీనియర్ సలహాదారుగా ఉన్నారు. వేదాంత్ పటేల్ స్టేట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ గా ఉండగా.. గరిమావర్మ ఫస్ట్ లేడీ ఆఫీస్ డిజిటల్ డైరెక్టర్ గా ఉన్నారు.

Exit mobile version