Site icon NTV Telugu

Srilanka Crisis: శ్రీలంకకు వెళ్లాల్సిన 120కి పైగా విమానాలు కేరళలో ల్యాండింగ్

Planes Landing In Kerala

Planes Landing In Kerala

శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక, రాజకీయ సంక్షోభం వల్ల ఆ దేశానికి వెళ్లాల్సిన 120కిపైగా విమానాలు కేరళ ఎయిర్‌పోర్టుల్లో ల్యాండ్‌ అయ్యాయి. ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోగా, దేశంలో అత్యయిక పరిస్థితి విధిస్తున్నట్టు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రకటించారు. ఈ నేపథ్యంలో శ్రీలంక చేరుకోవాల్సిన 120కి పైగా విమానాలను కేరళకు మళ్లించారు. ఈ విమానాలు కేరళలోని తిరువనంతపురం, కొచ్చి ఎయిర్ పోర్టుల్లో ల్యాండ్ అయ్యాయి.

కేరళలోని ఎయిర్‌పోర్టుల అధికారులు సమయానుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అభినందించారు. 120కి పైగా విమానాలను టెక్నికల్ ల్యాండింగ్ కు అనుమతించడం ద్వారా తమ విధులకు మించిన బాధ్యతలను నిర్వర్తించారని కొనియాడారు. పొరుగుదేశంతో మన సంబంధాల బలోపేతానికి ఈ చర్య ఎంతగానో దోహదపడుతుందని సింధియా అభిప్రాయపడ్డారు.

Viral News: రియల్ బాహుబల్ ఏనుగు.. 3కి.మీ. ఈది ప్రాణాలు కాపాడింది..

సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు ఈ మేరకు సహాయం చేసిన త్రివేండ్రం, కొచ్చి విమానాశ్రయాలను ఆయన అభినందించారు. ‘శ్రీలంకకు వెళ్లే 120కుపైగా విమానాలకు సాంకేతిక ల్యాండింగ్‌ను అనుమతించడం ద్వారా ఈ విమానాశ్రయాలు తమ విధిని మించి పనిచేశాయి. మన పొరుగువారితో సంబంధాలను మరింతగా పెంచుకునేందుకు ఇది చాలా దోహదపడుతుంది’ అని సింధియా ట్వీట్‌ చేశారు.

 

Exit mobile version