Site icon NTV Telugu

తాలిబాన్ల పరోక్ష హెచ్చరిక

అంతర్జాతీయ సమాజం తమను గుర్తించాలని తాలిబాన్లు కోరుతున్నారు. అమెరికా సహా ఇతర దేశాలు తమను తమ ప్రభుత్వాలను గుర్తించాలని లేదంటే మొదటికే మోసం వస్తోందని పరోక్షంగా హెచ్చరిచారు.తమను గుర్తించకుండా విదేశి నిధులు, విదేశి బ్యాంకు ఖాతాలను నిలిపి వేస్తే సమస్యలు ఒక్క ఆప్ఘాన్ కే పరిమితం కావాన్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలు తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించలేదు. సరికదా అమెరికా, ఐరోపా దేశాలు ఆప్గాన్‌కు నిధులను స్తంభింపజేశాయి.

దీంతో ఆప్గాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తాలిబాన్ అధికార ప్రతినిధి జబిబుల్లా మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా తమను గుర్తించని పక్షంలో ఆప్గాన్‌ సమస్యలు తిరిగి కొనసాగి అది ఈ ప్రాంతంతోపాటు ప్రపంచానికి ముప్పుగా పరిణమిస్తుందని పరోక్షంగా హెచ్చరించారు. అమెరికా 2001 సెప్టెంబర్‌ దాడుల తర్వాత అప్పటి ఆప్ఘాన్‌లో తాలిబాన్‌ల ప్రభుత్వం అల్‌-ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ ఒప్పగించడానికి నిరాకరించింది. దీంతో అమెరికా తాలిబాన్లపై యుధ్దం ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు అధికారికంగా తాలిబాన్‌ ప్రభుత్వాన్ని గుర్తించలేదు.

శనివారం టర్కీ విదేశాంగ శాఖ మంత్రి రసిత్‌ మెరెడా కాబూల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా తుర్కిమెనిస్తాన్‌- ఆప్ఘనిస్థాన్‌- పాకిస్థాన్‌- ఇండియా (tapi) గ్యాస్‌పైపు లైన్‌ గురించి చర్చించినట్టు ట్వీట్టర్‌లో తెలిపారు. కాగా, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీతో ఖతార్‌లో తాలిబాన్‌ ప్రతినిధులు రెండు రోజుల కిందట కలిశారు. ఆప్ఘాన్‌కు ఆర్థిక రవాణా మౌలిక సౌకర్యాలను కల్పించేందుకు చైనా నుంచి హామీ లభించిందని, తమ ఉత్పత్తులను పాకిస్తాన్‌ ద్వారా చైనా మార్కెట్‌కు చేరడానికి అనుమతి ఇస్తామన్నారు. ఇదిలా ఉంటే తాలిబాన్ల అరాచక పాలన, మహిళలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Exit mobile version