NTV Telugu Site icon

Titan: ఐదుగురు ప్రాణాల్ని తీసుకుంది.. అంతలోనే మళ్లీ టైటానిక్ వద్దకు తీసుకెళ్తుందట..

Titan

Titan

Titan: టైటాన్ సబ్‌మెర్సిబుల్ ప్రమాదం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. 1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ ఓడ శిథిలాలను చూపించేందుకు ఐదుగురిలో వెళ్లిన టైటాన్ సముద్రంలోనే పేలిపోయింది. తాజాగా టైటాన్ కు సంబంధించిన శిథిలాలను బయటకు తీసుకువచ్చారు. శిథిలాల్లో మానవ అవశేషాలను గుర్తించారు. ఈ ఘటనకు అంతా ‘ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్’ సంస్థను నిందిస్తున్నారు. సరైన భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే టైటాన్ లో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించారని ఆరోపిస్తున్నారు.

Read Also: India vs Pakistan: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ క్రేజ్ మమూలుగా లేదుగా.. రూ.1 లక్ష దాటిన హోటల్ ధరలు..

ఇదిలా ఉంటే ప్రమాదం జరిగి కొన్ని రోజులే అయింది. ఇంకా ఈ ప్రమాదం గురించి చర్చించుకుంటున్న సమయంలోనే ఓషన్ గేట్ సంస్థ టైటానిక్ శిథిలాల వద్దకు తీసుకెళ్తామనే ప్రకటన విమర్శలు వస్తున్నాయి. దీంతో పలువురు ఓషన్ గేట్ సంస్థపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఓషన్ గేట్ సంస్థ తన వెబ్‌సైట్‌లో తర్వాతి టైటానికి ట్రిప్ కు సంబంధించిన ప్రకటనను కొనసాగిస్తోంది. కంపెనీ 2024 జూన్ 12-20 మరియు జూన్ 21-29 వరకు రెండు విహారయాత్రలను ప్లాన్ చేస్తోంది. వెబ్‌సైట్ ప్రకారం, 8 డేస్-7 నైట్స్ ప్రయాణానికి ఒక్కొక్కరికి 250,000 డాలర్లు ఖర్చవుతుందని ప్రకటించింది. ఒక సబ్‌మెర్సిబుల్ డైవ్, ప్రైవేట్ వసతి, అవసరమైన అన్ని శిక్షణ, సాహసయాత్రతో పాటు అన్ని భోజన సదుపాయాలు ఈ ప్యాకేజీలో ఉంటాయని పేర్కొంది.

గత ఆదివారం టైటాన్ సబ్ మెర్సిబుల్ టైటానిక్ ఓడ శిథిలాలను చూసేందుకు అట్లాంటిక్ మహాసముద్ర లోతుల్లోకి వెళ్లింది. సముద్ర మట్టం నుంచి దాదాపుగా 4 కిలోమీటర్ల లోతులో టైటానిక్ శిథిలాలు ఉన్నాయి. అయితే టైటాన్ నీటిలోకి వెళ్లిన 1.45 గంటల తర్వాత దానితో సంబంధాలు కట్ అయ్యాయి. కొన్ని రోజుల పాటు రెస్య్కూ ఆపరేషన్ జరిగిన తర్వాత టైటాన్ ‘కాటస్ట్రోఫిక్ ఇంప్లోజన్’ అనే ప్రక్రియకు గురై పేలిపోయిందని యూఎస్ నేవీ ప్రకటించింది. ఇందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించినట్లు వెల్లడించింది. అత్యధిక పీడనానికి గురైన సందర్భంలో ఇంప్లోజన్ చోటు చేసుకుంటుంది. కేవలం కొన్ని క్షణాల్లోనే టైటాన్ పేలిపోయినట్లు గుర్తించారు.