NTV Telugu Site icon

Barack Obama: సొంత పార్టీ నేతలకే బరాక్ ఒబామా వార్నింగ్.. ఎందుకో తెలుసా..?

Obama

Obama

Barack Obama: అమెరికా అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలన్న జో బైడెన్‌ నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలు స్వాగతిస్తున్నారు. ఆయనపై పెద్దఎత్తున ప్రశంసలు గుప్పిస్తున్నారు. దేశం కోసం, పార్టీ ప్రయోజనాల కోసం నిస్వార్థంగా పని చేశారంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. ఇలా బైడెన్‌ నిర్ణయాన్ని ప్రసంచింన వారిలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఉన్నారు.

Read Also: CM Chandrababu: మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

అయితే, జో బైడెన్‌ నిర్ణయం దేశంపై ఆయనకున్న ప్రేమను చాటుతోందని మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా తెలిపారు. రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి.. అయినా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఆయన గొప్ప దేశభక్తుడని పేర్కొన్నారు. అధ్యక్షుడిగా బైడెన్‌ అంతర్జాతీయ వేదికపై అమెరికా ఔన్నత్యాన్ని చాటారు.. నాటోను పునరుజ్జీవింపజేశారన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను ఏకం చేశారని గుర్తు చేశారు. మరోవైపు రాబోయే రోజుల్లో ఊహించని పరిణామాలు ఎదురుకాబోతున్నామని డెమోక్రటిక్‌ పార్టీ శ్రేణులను బరాక్ ఒబామా అలర్ట్ చేశారు. కొత్త అధ్యక్ష అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ నాయకులు సరైన ప్రక్రియతో ముందుకొస్తారని వెల్లడించారు.

Read Also: Tamilnadu : పారిశుద్ధ్య కార్మికుడికి చెత్తలో దొరికిన డైమండ్ నెక్లెస్.. ఆ తర్వాత ఏమైందంటే

ఇక, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ అభ్యర్థిత్వానికి జో బైడెన్‌ సపోర్ట్ ఇచ్చారు. ఒబామా మాత్రం ఇప్పటి వరకు ఆమెకు మద్దతు ఇవ్వబోతున్నట్లు తెలపలేదు.. కొత్త నామినీ ఎంపిక కోసం సరైన ప్రక్రియతో ముందుకురావాలని పిలుపునివ్వడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన మరో కీలక నేత నాన్సీ పెలోసీ సైతం కమలా హారస్‌కు సపోర్ట్ ప్రకటించలేదు. కాగా, జో బైడెన్‌ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడంతో డెమోక్రాట్లలో అయోమయ పరిస్థితి ఏర్పాడింది. బరిలో ఎవరు నిలుస్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వచ్చే నెలలో జరిగే పార్టీ సదస్సులోనే అభ్యర్థిని ఎంపిక చేస్తారు. 4,700 మంది ప్రతినిధులు నామినీని ఆమోదించాల్సి ఉంది. మళ్లీ ప్రతినిధులతో పాటు మాజీ అధ్యక్షులు, మాజీ ఉపాధ్యక్షుల సపోర్టును కమలా హారిస్‌ కూడగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పాడింది.