Site icon NTV Telugu

Chinese Spy Balloons: అమెరికాతో పాటు ఇండియాపై బెలూన్‌తో నిఘా పెట్టిన చైనా..

Chinese Spy Balloons

Chinese Spy Balloons

Chinese Spy Balloons: డర్టీ డ్రాగన్ కంట్రీ చైనా అక్రమంగా ఇతర దేశాలపై గూఢచర్యం చేస్తోంది. ఇటీవల అమెరికా గగనతలంలో చైనా స్పై బెలూన్ విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని అమెరికా వాయుసేన జెట్ ఫైటర్లతో కూల్చేసింది. బెలూన్ శకలాలను సేకరిస్తోంది. బెలూన్ లో ఏ పరికరాలు ఉన్నాయి, ఏ ఉపగ్రహంతో అనుసంధానం అయి ఉంది.. ఎలాంటి సమాచారాన్ని సేకరించింది.. బెలూన్ లో ఉన్న పరికరాలకు సంబంధించి సఫ్లై చైన్స్ వివరాలను కూడా అమెరికా సేకరించే పనిలో ఉంది. 11 కిలోమీటర్ల వ్యవధిలో పడిన బెలూన్ శకలాలను వెలికితీస్తోంది అమెరికా.

Read Also: Asaduddin Owaisi: త్రివర్ణ పతాకంలో ఆకుపచ్చ రంగును మోదీ ప్రభుత్వం తొలగిస్తుందా..?

ఇదిలా ఉంటే చైనా ఒక్క అమెరికా మీదనే కాకుండా స్పై బెలూన్ల ద్వారా భారత్, జపాన్, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్‌లోని సైన్యం కదలికలపై నిఘా పెట్టినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికా, ఇండియాతో పాటు దాని మిత్రదేశలకు ఈ సమాచారాన్ని పంచుకుంది. అమెరికా డిప్యూటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ వెండి షెర్మాన్ 40 దేశాల రాయబార కార్యాలయాలతో సమాచాారాన్ని పంచుకున్నారు. హైనాన్ ప్రావిన్స్‌లో చైనా సైన్యం ఒక బేస్ ఏర్పాటు చేసుకుని ఈ స్పై బెలూన్ల ద్వారా నిఘా పెడుతున్నారని చెప్పారు.

చైనాకు వ్యూహాత్మకంగా చెక్ పెట్టాలని చూస్తున్న జపాన్, ఇండియా, వియత్నాం, తైవాన్ మరియు ఫిలిప్పీన్స్‌ దేశాల సైనిక సమాచారాన్ని నిఘా బెలూన్లు సేకరించాయని వాషింగ్టన్ పోస్ట్ మంగళవారం తెలిపింది. గత కొంత కాలంగా హవాయి, ఫ్లోరిడా, టెక్సాస్, గ్వామ్ మీదుగా కనీసం నాలుగు బెలూన్లను గుర్తించారు. ఇదిలా ఉంటే అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, చైనా రక్షణ మంత్రితో మాట్లాడాలని ప్రయత్నించినా..చైనా నుంచి స్పందన లేదు.

Exit mobile version