Russia: దీర్ఘకాలంగా జరుగుతున్న రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా మరన్ని ఆయుధాలను సమకూర్చుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని కోసం నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉంగ్ తో, రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రష్యా దీనికి వేదికకాబోతోంది. ఆయుధాల కోసం రహస్యంగా రష్యా చర్చలు జరుపుతోందని అమెరికా వెల్లడించింది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఆయుధాలను అందించేందుకు పుతిన్ ను కలవడానికి కిమ్ విదేశీ పర్యటనకు వెళ్లాలని భావిస్తున్నట్లు అమెరికా సోమవారం తెలిపింది.
Read Also: Big Breaking: “భారత్”గా మారనున్న”ఇండియా”.
ఉక్రెయిన్ యుద్ధంలో మరింత పట్టు సాధించేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నారు. అందుకోసమే ఆయుధాలను సమకూర్చుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ఇరాన్ నుంచి కామికేజ్ డ్రోన్లను రష్యా దిగుమతి చేసుకుంది. వీటి సాయంతో రష్యా, ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. ఆయుధాలను, సామాగ్రిని కొనుగోలు చేసుకునేందుకు పలు దేశాలతో రష్యా రహస్యంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
న్యూయార్క్ టైమ్స్ ప్రకారం కిమ్ ఈ నెలఖరులో పుతిన్ ను కలుసుకునేందుకు రైలులో వ్లాడివోస్టాక్ కి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియా నుంచి యాంటీ ట్యాక్ క్షిపణులు, ఆర్టిలరీ షెల్స్ ని పుతిన్ కొరుకుంటున్నట్లు సమాచారం. ఇదే విధంగా కిమ్ ఉపగ్రహ సాంకేతికతను, అణుశక్తితో నడిచే జలాంతర్గాముల కోసం ఆదునిక సాంకేతికతను, నార్త్ కొరియా ఆహార అవసరాలను తీర్చేందుకు సాయం కోరనున్నట్లు తెలుస్తోంది. 2022లో రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపుకు నార్త్ కొరియా రాకెట్లను, క్షిపణులను సమకూర్చింది.