Site icon NTV Telugu

North Korea: అమెరికాకు నార్త్ కొరియా వార్నింగ్.. అది హైపర్‌ సోనిక్‌ క్షిపణి అంటూ వెల్లడి

North Korea

North Korea

North Korea: దక్షిణ కొరియా, జపాన్‌లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌ పర్యటిస్తున్న సందర్భంగా ఉత్తర కొరియా హైపర్‌ సోనిక్‌ క్షిపణిని పరీక్షించింది. దీంతో పసిఫిక్‌ సముద్రంలో ఉన్న ఏ శత్రువునైనా నమ్మకంగా ఈ మిస్సైల్ ఎదుర్కోగలదని నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. ఇది కచ్చితంగా మా భద్రతను పెంచుతుందని వెల్లడించారు. ఈ ప్రయోగాన్ని కిమ్‌ స్వయంగా దగ్గర ఉండి తిలకించారని ది కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ (కేసీఎన్‌ఏ) తెలిపింది.

Read Also: Koil Alwar Tirumanjanam: శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. బ్రేక్‌ దర్శనాలు రద్దు

ఇక, ఈ క్షిపణి శబ్ధం కంటే 12 రెట్ల వేగంతో 1,500 కిలోమీటర్లు ప్రయాణించి సముద్రంలో పడిపోయిందని ఉత్తర కొరియా తెలిపింది. కానీ, దక్షిణ కొరియా మాత్రం ఇది కేవలం 1,100ల కిలోమీటర్లు మాత్రమే జర్నీ చేసిందని చెప్పుకొచ్చింది. అయితే, గతేడాది నవంబర్‌ నుంచి ఇది తొలి మిసైల్‌ టెస్ట్‌ మాత్రమే.. ఈ క్షిపణి కేవలం ఆత్మరక్షణ ప్రణాళికలో భాగంగా తయారు చేసింది.. ఇది దాడి చేయడానికి ఉద్దేశించింది కాదని పేర్కొనింది. అలాగే, ఈ మిసైల్‌ను ప్రపంచం విస్మరించొద్దు.. ఎంతటి రక్షణ వ్యవస్థలనైనా ఛేదించుకొని వెళ్లి ప్రత్యర్థిపై దాడి చేస్తుందన్నారు. మా దేశ రక్షణ సామర్థ్యాలను పెంచుకొనే పనిని భవిష్యత్తులో మరింత వేగవంతం చేస్తామని కిమ్‌ జోంగ్ ఉన్ వెల్లడించారు.

Exit mobile version