Zelensky: ఉక్రెయిన్‌పై యుద్ధానికి సపోర్టుగా నార్త్ కొరియా రష్యాకు భారీగా సైనికులను తరలిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఉత్తర కొరియా బలగాలు మాస్కో్కి చేరడంపై చైనా మౌనం వహించడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రశ్నించారు. ఉక్రెయిన్ పైకి కిమ్ బలగాలు ఇంకా దండెత్తలేదు.. మరికొన్ని రోజుల్లోనే అలా జరిగే అవకాశం ఉందన్నారు. ప్రాంతీయ భద్రతా హామీదారుగా ఉన్న చైనా దీనిపై సైలెంట్ గా ఉండటం సమంజసం కాదన్నారు. రష్యా కర్మాగారాల్లో ఉత్తర కొరియా ఆయుధాలు, కార్మికులు మాత్రమే కాదు.. మన ఆక్రమిత ప్రాంతాలైన కుర్స్క్‌లోను వారి సైనికులే ఉన్నారని ఆరోపించారు. కిమ్ సైన్యం మాతో పోరాడేందుకు రెడీ అవుతున్నారు.. మాస్కో- నార్త్ కొరియాతో బహిరంగ భాగస్వామ్యం ఉంది.. సుమారు 3.5 మిలియన్ ఫిరంగి షెల్స్‌ను రష్యా కొనుగోలు చేసిందని వ్లొదిమీర్ జెలెన్‌స్కీ చెప్పుకొచ్చారు.
Read Also: Fire Accident: హైదరాబాద్ లో అగ్నిప్రమాదం.. పూజ చేసి బయటకు వెళ్ళగానే చెలరేగిన మంటలు..
ఉక్రెయిన్‌పై దాడులు చేసేందుకు ఉత్తర కొరియా తన బలగాలను రష్యాలోకి తరలిస్తోందని నాటో ఇటీవల వెల్లడించింది. రష్యాలోని కుర్క్స్ ప్రాంతంలో కొన్ని బలగాలను ఇప్పటికే మోహరించినట్లు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే చెప్పుకొచ్చారు. మరోవైపు నార్త్ కొరియా సైనికులు ఉక్రెయిన్ యుద్ధంలోకి చొరబడితే.. కచ్చితంగా వాళ్లు కూడా తమ టార్గెట్ గా మారతారని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. యుద్ధాలకు ఇది సమయం కాదు.. వివాదాలను రణక్షేత్రంలో పరిష్కరించుకోలేమని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ఉక్రెయిన్ తరహా ఘర్షణల్ని చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలి.. ఆ మేరకు రష్యా- ఉక్రెయిన్ నేరుగా చర్చించుకోవాలని మోడీ వెల్లడించారు.