Kim Jong Un’s Sister Warns south korea: ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్న చెల్లిలు.. శక్తివంతమైన నాయకురాలు కిమ్ యో జోంగ్ దక్షిణ కొరియాకు హెచ్చరికలు చేశారు. ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. దక్షిణ కొరియా వల్లే ఉత్తర్ కొరియాలో కోవిడ్ ప్రబలిందని ఆమె ఆరోపించారు. అయితే కోవిడ్ వ్యాధిని ఉత్తర కొరియా సమర్థవంతంగా ఎదుర్కొందని ఆమె అన్నారు. తాజాగా కిమ్, ఆ దేశ ఆరోగ్య కార్యకర్తలు, అధికారులు, సైంటిస్టులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కోవిడ్ పై విజయం సాధించామని ప్రకటించారు.
గతంలో కూడా దక్షిణ కొరియానే ఉత్తర కొరియాలో కోవిడ్ వ్యాప్తికి కారణం అయిందని కిమ్ ఆరోపించాడు. అయితే ఈ వాదనల్ని దక్షిణ కొరియా తోసిపుచ్చింది. దక్షిన కొరియా తన సరిహద్దుల నుంచి బెలూన్లు, కరపత్రాలు, యూఎస్ డాలర్లను బెలూన్ల ద్వారా ఎగరవేస్తున్నారు. ఇవి బార్డర్ ను దాటి ఉత్తర కొరియాలో పడుతున్నాయి. అయితే ఈ విషయంపై కిమ్ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మే నెలలో ఉత్తర కొరియాలో కరోనా ఓమిక్రాన్ వ్యాప్తి ఎక్కువైంది. అయితే ఆ సమయంలో దక్షిణ కొరియానే వైరస్ ను దేశంలోకి పంపించారని.. కిమ్ సోదరి యో జోంగ్ ఆరోపిస్తున్నారు. ఇది మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరంగా ఆమె అభివర్ణించారు.
Read Also: Yogi oppose Modi: మోడీ చెబుతున్నదేంటి..? యోగి చేస్తున్నదేంటి..?
దక్షిణ కొరియా తమ ప్రాంతలోని కరపత్రాలను, డబ్బును, వస్తువులను పంపించడం ఆందోళన కలిగిస్తోందని.. దీనికి బలమైన ప్రతీకార ప్రతిస్పందనలు ఉంటాయని యో జోంగ్ హెచ్చరించారు. బెలూన్లను దక్షిణ కొరియా ఇలానే సరిహద్దుల వైపు పంపితే.. వైరస్ ను నిర్మూలించన విధంగా దక్షిణ కొరియా అధికారులను కూడా నిర్మూలించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.
