Site icon NTV Telugu

Nobel Peace Prize : ఈ ఏడాది నోబుల్ శాంతి బహుమతి ఎవరికి దక్కిందంటే..?

Nobel Prize

Nobel Prize

Nobel Peace Prize : ప్రపంచ శాంతి కోసం పాటు పడే వ్యక్తులకు ప్రతేడాది నోబుల్ శాంతి బహుమతి అందిస్తారు. ఈ ఏడాది బెలారస్ దేశానికి చెందిన ప్రముఖ మానవ హక్కుల ఉద్యమకారుడు అలెస్ బైలియాట్ స్కీ, రష్యాకు చెందిన మానవ హక్కుల సంస్థ ‘మెమోరియల్’, ఉక్రెయిన్ మానవ హక్కుల సంస్థ ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’ లను 2022 సంవత్సరానికి గాను నోబెల్ పీస్ ప్రైజ్ కు ఎంపిక చేశారు. తమ దేశాల్లో పౌర సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తూ అందిస్తోన్న సేవలకు గానూ ఈ బహుమతి ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ పేర్కొంది. ఈ మేరకు నార్వేజియన్ నోబెల్ కమిటీ అధికారికంగా ప్రకటించింది.

Read Also: Ola Uber Services: 3రోజుల్లో ఓలా, ఉబర్, ర్యాపిడో సర్వీసులు బంద్

అలెస్ బిలియాట్స్కీతో పాటు రష్యా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మెమోరియల్, ఉక్రెయిన్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ ఎన్నో ఏళ్లుగా అధికారాన్ని విమర్శించే హక్కును ప్రచారం చేయడంతో పాటు పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పింది. తమ దేశాల్లో ప్రజలకు ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు పట్ల అవగాహన కల్పించడం, ప్రోత్సహించడం, పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం వంటి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తులకు, సంస్థలకు శాంతి బహుమతి ఇస్తామని ఈ సందర్భంగా కమిటీ వివరించింది.

Read Also: Kanika Dhillon: వారు స్త్రీలను పశువుల్లా చూస్తారు.. రాఘవేంద్ర రావు మాజీ కోడలు షాకింగ్ కామెంట్స్

యుద్ధ నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగం వంటివాటిపై పత్రాలు సమర్పించడంలో ఎంతగానో కృషి చేశారని పేర్కొంది. శాంతి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో పౌర సమాజ ప్రాముఖ్యతను చాటి చెప్పారని నోబెల్ కమిటీ చెప్పింది. ఆయా కారణాల వల్ల అలెస్ బిలియాట్స్కీతో పాటు పాటు రష్యా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మెమోరియల్, ఉక్రెయిన్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ కు సంయుక్తంగా ఈ అవార్డు ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది శాంతి బహుమతి విజేతలు యుద్ధ నేరాలను నమోదు చేయడం, మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడం ద్వారా అమోఘమైన కృషి చేశారని నోబెల్ కమిటీ కొనియాడింది. శాంతి, ప్రజాస్వామ్యం నెలకొల్పడంలో పౌర సమాజం పాత్ర ప్రాముఖ్యతను వారు చాటి చెప్పారని వివరించింది.

Exit mobile version