Nirav Modi: నీరవ్ మోడీ అప్పగింతకు రంగం సిద్ధం! మూసుకున్న న్యాయ మార్గాలు
- నీరవ్ మోడీ అప్పగింతకు రంగం సిద్ధం!
- మూసుకున్న న్యాయ మార్గాలు
- త్వరలోనే అప్పగించే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అప్పగింతకు రంగం సిద్ధమైంది. త్వరలోనే బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించనుంది. చివరి అవకాశంగా న్యాయ మార్గాలు కూడా మూసుకున్నాయి. యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (ECHR)లో దాఖలు చేసిన తన చివరి న్యాయపరమైన సవాల్లో కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో భారత్‌కు అప్పగింతను అడ్డుకునే అన్ని న్యాయ మార్గాలు ముగిసినట్లయ్యాయి.
యూకే కోర్టుల్లో అందుబాటులో ఉన్న అన్ని అప్పీల్ అవకాశాలు పూర్తిగా ముగిసిన అనంతరం.. 2026 ఏప్రిల్‌లో నీరవ్ మోడీ యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌ను ఆశ్రయించారు. అయితే ఆయనకు ఎలాంటి ఉపశమనం కల్పించేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో అప్పగింతను నిలిపివేయడానికి ఆయనకు ఇకపై ఎలాంటి న్యాయపరమైన అవకాశం మిగలలేదు. న్యాయ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో యూకే ప్రభుత్వం నీరవ్ మోడీని భారత అధికారులకు అప్పగించేందుకు అవసరమైన పరిపాలనా చర్యలను ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దౌత్య వర్గాల సమాచారం ప్రకారం.. అప్పగింత ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read
- Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
- Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
నీరవ్ మోడీ 2019 మార్చి నుంచి లండన్‌లోని హెచ్ఎంపీ వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో జరిగిన బహుళ కోట్ల రూపాయల రుణ మోసం కేసుతో పాటు దానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయనను భారత్‌కు తీసుకురావడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) గత కొన్ని సంవత్సరాలుగా న్యాయపోరాటం కొనసాగిస్తున్నాయి. నీరవ్ మోడీ అప్పగింత పూర్తయితే.. దేశంలో సంచలనం సృష్టించిన పీఎన్బీ మోసం కేసు దర్యాప్తులో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. భారత్‌కు తీసుకొచ్చిన అనంతరం ఆయనపై పెండింగ్‌లో ఉన్న కేసులపై విచారణ మరింత వేగవంతం కానుంది.
తాజావార్తలు
-
TPCC: సీఎం రేవంత్‌రెడ్డితో మల్లు రవి భేటీ.. కొండా సురేఖ ఎపిసోడ్‌పై మీనాక్షి నటరాజన్, పీసీసీకి నివేదిక..
-
Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
-
Minister Anitha: హోంమంత్రి అనితకు స్వల్ప గాయం!
-
Sangareddy: ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్‌తో తానూ ఆత్మహత్య
-
Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..