NTV Telugu Site icon

COVID-19: హడలెత్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్ “పిరోల”.. మిగతా వాటితో పోలిస్తే ఎందుకు భిన్నమైంది..?

Covid New Variant

Covid New Variant

COVID-19: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కోవిడ్-19 పీడ విరగడయ్యేలా కనిపించడం లేదు. తన రూపాలను మార్చుకుంటూ ప్రపంచంపై దాడి చేస్తూనే ఉంది. బీటా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా మరో వేరియంట్ ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. BA.2.86 లేదా పిరోలా అనే కరోనా వైరస్ వేరియంట్ ఓమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతోంది.. అమెరికా, యూకే, చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పిరోలా వేరియంట్ ఇజ్రాయిల్, కెనడా, డెన్మార్క్, యూకే, దక్షిణాఫ్రికా, స్వీడన్, నార్వే, స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్ దేశాల్లో కనుగొనబడింది.

2021లో బయటపడిన ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచంలో కేసుల పెరుగుదలతో పాటు భారీగా మరణాలకు కారణమైంది. అయితే ఇప్పుడు దీని సబ్ వేరియంట్ ‘పిరోలా’ మరెంత ప్రమాదాన్ని తీసుకువస్తుందా..? అని పరిశోధకులు భయపెడుతున్నారు. గతంలో ఓమిక్రాన్ శరీర వ్యాధినిరోధక శక్తిని, టీకా ప్రభావాన్ని తట్టుకుని ఇన్ఫెక్షన్లకు కారణమైంది.

Read Also: TS News: మేకను దొంగిలించాడని తలకిందులుగా వేలాడదీసిన యజమాని.. ఇదెక్కడి అరాచకం

అయితే ఇప్పుడు కొత్త BA.2.86(పిరోలా) వేరియంట్ గతంతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండటం పరిశోధకుల భయాలకు కారణవుతోంది. ఈ వేరియంట్ స్పైక్ ప్రొటీన్‌పై ఏకంగా 30 ఉత్పరివర్తనాలు(మ్యుటేషన్స్) ఉన్నాయి. ఇది మానవకణాల్లోకి సులువుగా ప్రవేశించడానికి వీలు కల్పిస్తాయి. పిరోలా మల్టీ మ్యుటేషన్స్ మునపటి కరోనా వైరస్ వేరియంట్లతో పోలిస్తే దాని నిర్మాణంలో పూర్తి భిన్నంగా ఉందని స్క్రిప్స్ రీసెర్చ్ ట్రాన్స్లేషనల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ఎరిక్ టోపోల్ రాయిటర్స్‌తో అన్నారు.

అయితే ప్రస్తుతం పిరోలా వ్యాప్తి పెద్దగా కనిపించడం లేదు, అయితే పిరోలా తీవ్రతకు సంబంధించి మునపటి వేరియంట్లతో పోలిస్తే ఈ వేరియంట్ ఎంత తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుందో చాలా త్వరగా తెలుసుకోవాలని యూఎస్ సెంట్రల్ డిసీజ్ కంట్రోల్(సీడీసీ) పేర్కొంది. ఇది ఎంత ప్రమాదకరంగా ఉంటుందో అనే వివరాలను సీడీసీ నిశితంగా గమనిస్తోంది.