Netanyahu: నెతన్యాహూ చనిపోయారా.? అనుమానాలు పెంచుతున్న వీడియో..
- వైరల్ అవుతున్న నెతన్యామూ ‘‘6 ఫింగర్’’ వీడియో..
- నెతన్యాహూ బతికే ఉన్నాడా? అని యూజర్ల అనుమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Netanyahu: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. అయితే, ఈ వీడియో నెటిజన్లలో అనుమానాలు పుట్టిస్తోంది. అనేక మంది ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ ఎక్కడ ఉన్నారు? అని అడుగుతున్నారు. మార్చి 13న ఆయన చేసిన తాజా వీడియోపై అనేక మంది వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు, ఈ వీడియో ఆయన చేతిలో ఆరు వేళ్లు ఉన్నట్లు అనిపించింది. ఏఐ ఉపయోగించి ఈ వీడియోను తయారు చేశారనే అనుమానాలను లేవనెత్తారు.
నెతన్యాహు శుక్రవారం తన ఎక్స్ హ్యాండిల్లో ఒక వీడియోను షేర్ చేస్తూ.. ఇజ్రాయిల్, అమెరికాలు ఇరాన్‌పై చేస్తున్న దాడులు గురించి వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై యుద్ధం మొదలై 15 రోజులు గడుస్తున్నాయి. ఫిబ్రవరి 28న జరిగిన సంఘర్షణ మొదటి రోజున, ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతల్లో అలీ ఖమేనీ దాడుల్లో మరణించారు. దీని తర్వాత, ఇరాన్ తన పొరుగున ఉన్న యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రైయిన్‌లపై ప్రతీకార దాడులు చేస్తోంది. హార్ముజ్ జలసంధిని మూసేసి చమురు రంగాన్ని దెబ్బకొట్టింది.
Also Read
Read Also: Tamannaah: షాకింగ్.. తమన్నా బుగ్గపై అభిమాని ముద్దు, తర్వాత ఏం జరిగిందంటే?
అయితే.. నెతన్యాహూ వీడియోలో ఆయన చేతికి ఆరు వేళ్లు ఉన్నట్లు నెటిజన్లు పేర్కొన్నారు. వీడియో AI-ఎడిట్ చేయబడిందా? అని అనుమానిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు అనేక మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ‘క్లాసిక్ AI ఫింగర్ గ్లిచ్’, ‘అతని చేతిని దగ్గరగా చూడండి’ వంటి కామెంట్స్ పెడుతున్నారు. చాలా మంది యూజర్లు ఆయన చనిపోయారని పేర్కొంటున్నారు.
అమెరికన్ కన్జర్వేటివ్ రాజకీయ వ్యాఖ్యాత కాండేస్ ఓవెన్స్ కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆమె ‘‘బీబీ ఎక్కడ..?’’ ప్రశ్నించారు. నెతన్యాహూను బీబీ అని కూడా పిలుస్తారు. ‘‘అతని కార్యాలయం అతని నుండి నకిలీ AI వీడియోలను ఎందుకు విడుదల చేస్తోంది మరియు తొలగిస్తోంది మరియు వైట్ హౌస్‌లో ఎందుకు భారీ భయాందోళనలు ఉన్నాయి?’’ అని ఆమె ఎక్స్ పోస్టులో అడిగింది.
ఇదిలా ఉంటే, ఈ వార్తల్ని AI బాట్ ‘గ్రోక్’ కొట్టిపారేసింది. నెతన్యాహూకు సాధారణంగా అందరిలాగే ఐదు వేళ్లే ఉన్నాయని, ఈ వీడియోలో కెమెరా యాంగిల్, వెలుతురు వల్ల ఒక భ్రమ కలిగిస్తుందని చెప్పింది. ఇజ్రాయెల్ ప్రధాని మరణించారనే వార్తల్లో ఎటువంటి నిజం లేదని ‘టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ మరియు ఇతర ఫ్యాక్ట్-చెక్ సంస్థలు ధృవీకరించాయి.
אתמול במסיבת העיתונאים עמדתי על היעדים הברורים של המערכה: פגיעה במשטר הטרור באיראן, המשך המאבק מול שלוחותיו, והבטחת ביטחונה ועתידה של ישראל.
אנחנו לא מחכים. אנחנו יוזמים, אנחנו תוקפים ואנחנו עושים זאת בעוצמה.
צפו בדברים המלאים >> pic.twitter.com/hubJWVdiKQ
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) March 13, 2026
తాజావార్తలు
-
Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!