Site icon NTV Telugu

Netanyahu: హమాస్ ఇంకా అంతం కాలేదు.. శాంతి చర్చల వేళ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

Netanyahu2

Netanyahu2

గాజా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలై నేటితో రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఇంకా నాశనం కాలేదని.. యుద్ధం ముగించడానికి దగ్గరగా ఉన్నట్లు తెలిపారు. యుద్ధం ఎక్కడ మొదలైందో.. అక్కడే ముగుస్తోందని వ్యాఖ్యానించారు. అక్టోబరు 7న హమాస్‌ చేసిన దాడులతో ఇజ్రాయెల్‌ పనైపోయిందని అందరూ భావించారని.. కానీ ఊహించని విధంగా ఇంకా బలపడిందని నెతన్యాహు తెలిపారు. హమాస్‌ ఇంకా నాశనం కాలేదని.. కానీ ఆ లక్ష్యాన్ని తాము త్వరలోనే చేరుకుంటామని స్పష్టం చేశారు. అప్పుడు ఇజ్రాయెల్‌ మరింత బలమైన దేశంగా అవతరిస్తుందని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: CJI Gavai: పశ్చాత్తాపం లేదు.. గవాయ్‌పై నిందితుడు మరోసారి పరుష వ్యాఖ్యలు

ఇక ట్రంప్‌తో ఉన్న సంబంధంపై కూడా మాట్లాడుతూ… వాషింగ్టన్‌, న్యూయార్క్‌లను చేరుకునే ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను ఇరాన్‌ అభివృద్ధి చేస్తోందని.. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ట్రంప్‌ను హెచ్చరించారు. సహజంగా ఒక దేశం తనకు తాను మొదట ప్రాధాన్యం ఇస్తుందని.. అలాగని అమెరికా ఫస్ట్ అంటే ఒక్క అమెరికానే ఉంటుందని కాదన్నారు. గ్రేట్ పవర్స్‌కు మిత్ర దేశాలు కావాలని… ఇజ్రాయెల్ అనేది యుద్ధరంగంలో పోరాడుతోన్న ఒక మిత్ర దేశం అని నెతన్యాహు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Kejriwal: మాయావతి ఇల్లు కోరిన కేజ్రీవాల్! ఆప్ అధ్యక్షుడికి ఏ బంగ్లా కేటాయించారంటే..!

అక్టోబర్ 7, 2023 ఎవరూ మరిచిపోలేని రోజు. ప్రపంచమంతా ఉలిక్కిపడ్డ రోజు. హమాస్ ముష్కరులు ఊహించని రీతిలో ఇజ్రాయెల్‌లోకి చొరబడి 1,200 మందిని చంపి దాదాపు 251 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన ఇజ్రాయెల్‌నే కాకుండా యావత్తు ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఇక అంతే వేగంగా ఇజ్రాయెల్ కూడా ప్రతి స్పందించి హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా గాజాపై భీకర దాడులు చేసింది. హమాస్ అగ్ర నాయకులందరినీ మట్టుబెట్టింది. ఈ క్రమంలో వందలాది మంది పాలస్తీనీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ నాడు మొదలైన యుద్ధం.. నేటికీ కొనసాగుతోంది. ఈరోజుతో (07-10-2025) గాజా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలై రెండేళ్లు పూర్తైంది. గాజా ప్రస్తుతం శవాల దిబ్బగా మారింది. ఎటుచూసినా కూలిన బిల్డింగ్‌లతో కళావిహీనంగా మారింది.

Gaza

Exit mobile version