NTV Telugu Site icon

Israel PM Netanyahu: మా పోరాటం హెజ్‌బొల్లాపై.. లెబనాన్ ప్రజలపై కాదు

Isreal

Isreal

Israel PM Netanyahu: లెబనాన్‌ సరిహద్దుల్లో ఉన్న ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ సిబ్బందే టార్గెట్‌గా ఇజ్రయెల్‌ సైన్యం దాడులు కొనసాగిస్తుందని వస్తున్న ఆరోపణలపై ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రధాని నెతన్యాహు మీడియతో మాట్లాడుతూ.. లెబనాన్‌ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అక్కడ పర్యటిస్తున్న ఐక్యరాజ్యసమితి శాంతిపరిక్షణ సిబ్బందిని ఆ ప్రాంతంలో తాత్కాలికంగా తమ విధులు ఉపసంహరించుకోవాలని మా సైన్యం కోరిందని చెప్పుకొచ్చారు.

Read Also: Pakistan SCO Meeting: నేటి నుంచి పాకిస్థాన్‌లో ఎస్‌సీఓ సదస్సు.. హాజరుకానున్న జైశంకర్..

ఇక, హెజ్‌బొల్లా లక్ష్యాలపై దాడి చేస్తున్న టైంలో లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ సిబ్బందికి హాని కలిగించకుండా ఉండేందుకు ఇజ్రాయెల్ సైన్యం తగిన చర్యలు తీసుకుంటుందని ప్రధాని నెతన్యాహూ పేర్కొన్నారు. అయితే, ఉద్రిక్తతలు కొనసాగుతున్న లెబనాన్‌ సరిహద్దు ప్రాంతాన్ని తాత్కాలికంగా విడిచి పెట్టాలని యూఎన్‌ఎఫ్‌ఐఎల్‌ను ఇజ్రాయెల్ సైన్యం పదే పదే కోరుతుంది.. హెజ్‌బొల్లా టెర్రరిస్టులను నిర్మూలించేందుకు లెబనాన్‌పై దాడులు ప్రారంభించిన రోజున ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ సభ్యులకు తాను విజ్ఞప్తి చేశాను అని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు.

Read Also: AP Liquor Shops: నేటితో మూతపడనున్న ప్రభుత్వ వైన్‌షాపులు..

అయితే, మా పోరాటం ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ, లెబనాన్ ప్రజలతో కాదు అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ పేర్కొన్నారు. మాపై దాడి చేయడానికి లెబనాన్‌ భూభాగాన్ని ఉపయోగించుకునే.. ఇరాన్ అనుబంధ హెజ్‌బొల్లా గ్రూప్‌తో మా సైన్యం పోరాటం చేస్తుంది అని ఆయన తెలిపారు. హమాస్ మారణకాండ జరిగిన తర్వాత నుంచి తాము దాడులు కొనసాగిస్తున్నాం.. అయితే, లెబనాన్‌లో హెజ్‌బొల్లా గ్రూప్‌ను అంతం చేయటమె ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ యొక్క ప్రధాన లక్ష్యం అని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు.