Israel: అమెరికాపై ఆధారపడొద్దు.. ఇజ్రాయిల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..

  • మన ఆయుధాలు మనమే తయారు చేసుకోవాలి..
  • అమెరికాపై ఆధారపడటం తగ్గించుకోవాలి..
  • ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు..
Netanyahu

Netanyahu

Israel:  ఇజ్రాయిల్ సైనికంగా మరింత స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ఇజ్రాయిల్ సొంతగా ఆయుధ తయారీ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలని, విదేశీ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఆయన అన్నారు. ఇరాన్‌తో పాటు ఇతర దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో నెతన్యాహూ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.

ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ గుష్ ఎట్జియోన్ ప్రాంతంలో రిజర్వ్ కంబాట్ ఫోర్స్ అధికారులతో జరిగిన సమావేశంలో నెతన్యాహూ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి తమకు లభించిన సైనిక మద్దతుకు థాంక్స్ చెబుతూనే, రాబోయే రోజుల్లో మన ఆయుధాలనున మనమే తయారు చేసుకోవాలనే పిలుపునిచ్చారు. రాబోయే దశాబ్దాలలో ఇజ్రాయెల్ స్థానం దాని సైనిక బలం, సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ఇరాన్, దాని మిత్రదేశాలకు గట్టి సమాధానం ఇచ్చినప్పటికీ, ఇది ఇంకా ముగియలేదని అన్నారు. రాబోయే 30 ఏళ్లలో మన స్థానాన్ని మన బలమే నిర్ణయిస్తుందని చెప్పారు.

×
×
Ad