Site icon NTV Telugu

Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్‌.. నెతన్యాహు దంపతులు ఘనస్వాగతం

Trump10

Trump10

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ట్రంప్‌కు నెతన్యాహు, సారా దంపతులు, ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్, ఆయన సతీమణి మిచల్ హెర్జోగ్ ఘనస్వాగతం పలికారు.

ఇది కూడా చదవండి: Trump: ఇజ్రాయెల్‌కు బయల్దేరేటప్పుడు భారీ వర్షం.. గొడుగుతో ఇబ్బంది పడ్డ ట్రంప్.. వీడియో వైరల్

ఇక పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించనున్నారు. అనంతరం బందీల కుటుంబాలను కలవనున్నారు. అటు తర్వాత షేర్మ్ ఎల్-షేక్ శాంతి సదస్సులో పాల్గొనేందుకు ఈజిప్టునకు ట్రంప్ వెళ్తారని వైట్‌హౌస్ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Trump-Israel: బందీల విడుదల వేళ ట్రంప్‌కు అత్యున్నత పురస్కరం ప్రకటించిన ఇజ్రాయెల్

ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ల ప్రణాళికకు ఇరు వర్గాలు మద్దతు తెల్పడంతో సోమవారం ఏడుగురు బందీలను హమాస్ విడుదల చేసింది. మిగతా బందీలను కూడా హమాస్ విడుదల చేయనుంది. రెండేళ్ల తర్వాత బందీలు విడుదలవ్వడంతో ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. థ్యాంక్యూ ట్రంప్ అంటూ హోర్డింగ్‌లు వెలిశాయి. అంతేకాకుండా ఇజ్రాయెలీయులు రోడ్లపైకి వచ్చి హర్హధ్వానాలు వినిపించారు.

హమస్ బందీలను విడుదల చేయడాన్ని యూరోపియన్ దౌత్యవేత్త కాజా కల్లాస్ హర్షం వ్యక్తం చేశారు. శాంతికి ఇదొక కీలక మైలురాయిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ట్రంప్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

2023, అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1,200 మందిని చంపి.. 251 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. మధ్యలో అంతర్జాతీయ మధ్యవర్తుల కారణంగా కొంత మంది బందీలను హమాస్ విడుదల చేసింది. ఒకేసారి అందరినీ విడిచిపెట్టాలని ఇజ్రాయెల్ ఒత్తిడి చేసింది. అందుకు ససేమిరా అనడంతో తిరిగి యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళికను ప్రాతిపాదించారు. దీనికి హమాస్-ఇజ్రాయెల్ సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఎట్టకేలకు ఈజిప్టు వేదికగా తొలి విడత జరిగిన చర్చలు విజయవంతంగా ముగియడంతో సోమవారం మూడు విడతలుగా బందీలను విడుదల చేస్తున్నారు. అలాగే ఇజ్రాయెల్ జైలు నుంచి పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనున్నారు.

 

Exit mobile version