Nepal: 25 మందిని చంపిన ‘‘కిల్లర్ ఏనుగు’’.. ఒకే కుటుంబంపై రెండుసార్లు దాడి..
- నేపాల్‌లో మరోసారి బీభత్సం సృష్టించిన కిల్లర్ ఏనుగు.
- 14 ఏళ్లలో 25 మంది ప్రాణాలు బలిగొన్నట్లు రికార్డులు.
- ఒకే కుటుంబంపై రెండోసారి దాడి చేసి తల్లి, కుమారుడి మృతి.
- ప్రభుత్వం చంపేందుకు అనుమతి ఇచ్చినా ఇప్పటికీ దొరకని ఏనుగు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal: నేపాల్‌లో ఒక ఏనుగు 14 ఏళ్లుగా బీభత్సం సృష్టిస్తోంది. చిత్వాన్ నేషనల్ పార్క్ సమీపంలోని జగత్పూర్ ప్రాంతంలో 25 ఏళ్ల మహిళ, ఆమె 4 ఏళ్ల కుమారుడిని తొక్కి చంపింది. దీనిని నేపాల్‌లో అత్యంత ప్రమాదకరమైన ‘‘కిల్లర్ ఏనుగు’’గా అధికారులు పరిగణిస్తారు. ఈ ఏనుగు ఇప్పటి వరకు 25 మందిని చంపింది. దాడి తర్వాత ఈ ఏనుగు అడవిలోకి పారిపోయింది. అటవీ శాఖ ఏనుగును పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది.
2012లో ఇదే కుటుంబానికి చెందిన తల్లిదండ్రుల్ని ఈ ఏనుగు చంపేసింది. ఆ సమయంలో సురక్షితంగా ఉండేందుకు మిగిలిన కుటుంబీకులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు అదే ఏనుగు కుటుంబంలోని మహిళ, ఆమె కుమారుడిని బలి తీసుకుంది. చిత్వాన్ చుట్టుపక్కల అడవులు, గ్రామాలు పక్కపక్కనే ఉండటంతో తరుచుగా ఏనుగులు ఊళ్లపై దాడులు చేస్తుంటాయి.
Also Read
- Strait of Hormuz: హోర్ముజ్‌పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్‌లో పాల్గొననున్న జిన్‌పింగ్
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్‌కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
చిత్వాన్ జాతీయ ఉద్యానవనం రికార్డుల ప్రకారం.. 2010 నుండి ఇప్పటి వరకు కనీసం 25 మంది మరణాలకు ఈ ఏనుగే కారణమని భావిస్తున్నారు. 2012లో, ఇది ఒక్క రోజులోనే 68 ఇళ్లను ధ్వంసం చేసింది. పదేపదే జరుగుతున్న ఈ దాడుల నేపథ్యంలో, ఈ ఏనుగును చంపడానికి నేపాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సైన్యం, అటవీ శాఖ ఏనుగు కోసం గాలింపు చేపట్టారు. దాడి తర్వాత ఏనుగు అడవిలోకి పారిపోయింది. ప్రస్తుతం దానిని చంపే లైసెన్స్ గడువు ముగిసింది. ఏనుగును ట్రాక్ చేయడానికి దాని మెడపై ట్రాకింగ్ కాలర్ అమర్చారు.
తాజావార్తలు
-
Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
Strait of Hormuz: హోర్ముజ్‌పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
-
KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
-
Irumudi Movie Controversy : ‘ఇరుముడి’ సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!