Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
- నేపాల్‌లో హిమపాతం బీభత్సం
- హిమపాతం కూలి 15 మంది మృతి
- మరొకరు గల్లంతు.. గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేపాల్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. విదేశీ పర్వతారోహకుల కోసం హిమాలయాల్లో బేస్ క్యాంప్‌ను సిద్ధం చేస్తున్న నేపాలీ కార్మికులపై భారీ హిమపాతం విరుచుకుపడింది. ఈ ఘటనలో 15 మంది కార్మికులు మృతి చెందారు. మరో వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ నెలతో ముగియనున్న శరదృతువు పర్వతారోహణ సీజన్లో చోటుచేసుకున్న అత్యంత ప్రాణాంతక ఘటనగా అధికారులు పేర్కొన్నారు.
ఉత్తర నేపాల్‌లోని మానాంగ్ జిల్లాలో 7,126 మీటర్ల (23,379 అడుగుల) ఎత్తైన హిమ్‌లుంగ్ హిమాల్ పర్వతం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. విదేశీ పర్వతారోహకులు శిఖరాన్ని అధిరోహించేందుకు అవసరమైన బేస్ క్యాంప్‌ను సిద్ధం చేసేందుకు నేపాలీ కార్మికులు అక్కడ టెంట్లు ఏర్పాటు చేస్తుండగా… తాళ్లు బిగిస్తుండగా వారిపై హిమపాతం విరుచుకుపడింది. 15 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గల్లంతయ్యారు.
Also Read
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
గురువారం మంచు కింద నుంచి మరో 8 మృతదేహాలను బయటకు తీశారు. అంతకుముందే మరో 7 మృతదేహాలను వెలికితీశారు. గురువారం వెలికితీసిన మృతదేహాలను హెలికాప్టర్ ద్వారా ఖాట్మండు తరలించనున్నట్లు గురుంగ్ తెలిపారు. మరో కార్మికుడు గల్లంతయ్యాడని.. సజీవంగా గుర్తించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కూడా త్వరలోనే ముగిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే సహాయక బృందాలు గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి.
అదృష్టవశాత్తూ హిమపాతం సంభవించే సమయానికి విదేశీ పర్వతారోహకులు బేస్ క్యాంప్‌కు చేరుకోలేదు. దీంతో భారీ ప్రాణనష్టం నుంచి వారు తప్పించుకున్నారు. ప్రతి ఏడాది వేలాది మంది పర్యాటకులు నేపాల్‌లోని పర్వత ప్రాంతాలను సందర్శించడంతో పాటు పర్వతారోహణకు వస్తుంటారు. వీరి కోసం గైడ్లు, పోర్టర్లు, ఇతర సహాయక సిబ్బందిగా వేలాది మంది నేపాలీయులకు ఉపాధి లభిస్తోంది.
తాజావార్తలు
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?