Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్‌కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
- మరో ప్రమాదం ముంగిట నేపాల్..
- పొంగిపొర్లుతున్న మరో హిమానీనద సరస్సు..
- ఏ క్షణానైనా దిగువ ప్రాంతాలనను ముంచెత్తే అవకాశం..
- రానున్న మరో 90 నిమిషాలు కీలకమని చెబుతున్న అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Floods: గురువారం సంభవించిన మెరుపు వరదలు నేపాల్‌ను తీవ్రంగా కష్టాల్లోకి నెట్టింది. వరదలు ఆ దేశంలో విధ్వంసాన్ని సృష్టించాయి. భోటేకోశి నది ఉప్పొంగడంతో చాలా గ్రామాలు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి. ఇప్పటికే నేపాల్ మృతుల సంఖ్య 400లను దాటింది. ఇదిలా ఉంటే, నేపాల్‌ను మరో ముప్పు వెంటాడుతోంది. నేపాల్-టిబెట్ సరిహద్దుల సమీపంలోని గారింగ్ సరిహద్దు ప్రాంతం ఎగువన హిమానీనదం కూలిపోవడంతో ఏర్పడిన సహజ సరస్సు ఇప్పుడు పొంగిపొర్లుతోంది. సరస్సు నుంచి నీరు గట్టను దాటి బయటకు వస్తున్నట్లు చైనీస్ మీడియా సీసీటీవీ శుక్రవారం వెల్లడించింది.
సరస్సు నుంచి భారీగా నీరు బయటకు వస్తుండటంతో దిగువ ప్రాంతాల్లోని నదుల్లో నీటి మట్టం పెరుగుతోంది. ఇప్పటికే వరద విధ్వంసంతో చిగురుటాకులా వణికిన నేపాల్ మరో ముప్పును ఎదుర్కోబోతోంది. నదీ పరివాహక ప్రాంతాలకు భారీ వరద ముప్పు ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న శుక్రవారం మధ్యాహ్నం 2.30 తర్వాత 1.5-2 గంటలు చాలా కీలకంగా ఉండబోతున్నట్లు అక్కడి అధికారులు హెచ్చరించారు.
Also Read
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
సరస్సు నుంచి నీరు గట్లను దాటి కిందకు వస్తుందన్న సమాచారం రావడంతో నేపాలీ సైన్యం, సహాయక బృందాలు తమ రెస్క్యూ కార్యక్రమాలనున తాత్కాలికంగా నిలిపేశారు. 90 నిమిషాల పాటు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు, నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలను ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.
చైనా సర్వే ప్రకారం, ప్రస్తుతం సరస్సులో 25 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా నీరు నిల్వ ఉంది. ఒక్కరోజు ముందు ఈ పరిమాణం సుమారు 15–20 లక్షల క్యూబిక్ మీటర్లుగా అంచనా వేశారు. దీనిని బట్టి చూస్తే పరిస్థితి ఎంత వేగంగా మారుతోందో తెలుస్తోంది. రాబోయే మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు సరస్సులోకి చేరే అవకాశం ఉందని చైనా గతంలో అంచనా వేసింది. ఇది దాదాపు 1,200 ఒలింపిక్-సైజ్ స్విమ్మింగ్ పూల్స్‌కు సమానం. సరస్సు ఆనకట్ట తెగితే దిగువ ప్రాంతాలకు ఒక్కసారిగా భారీ నీటి ప్రవాహం ముంచెత్తే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!