Site icon NTV Telugu

Alexei Navalny: కప్ప విషంతో అలెక్సీ నావల్నీ హత్య.. రష్యాపై సంచలన ఆరోపణలు..

Navalny

Navalny

Alexei Navalny: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తీవ్రంగా విమర్శించే వ్యక్తిగా, రష్యా ప్రతిపక్ష నేతగా పేరున్న ‘‘అలెక్సీ నావల్నీ’’ హత్యకు రష్యా ప్రభుత్వమే బాధ్యత వహించాలని యూకే, ఫ్రాన్స్, జర్మనీ సహా ఐదు యూరోపియన్ దేశాలు డిమాండ్ చేశాయి. నావల్నీని విష ప్రయోగంతో చంపేవారని ఆరోపించాయి. దక్షిణ అమెరికాలో డార్ట్ కప్పలలో కనిపించే విషం, రష్యాలో కనిపించని ‘‘ఎపిబాటిడిన్’’తో హత్య చేసినట్లు ఆయా దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలు నిర్ధారించాయి.

Read Also: Maha Shivaratri 2026: రావణుడు శివుడిని ఎలా పూజించేవాడు.. ఆ మహాదేవుడు ఎందుకు కరిగిపోయాడు..?

రష్యా ప్రభుత్వం నావల్నీని లక్ష్యంగా చేసుకోవడానికి ప్రాణాంతక విషాన్ని ఉపయోగించిందని మాకు తెలుసు అని యూకే విదేశాంగ శాఖ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా ఈ విషాన్ని ఇవ్వడానికి అనేక మార్గాలు, ఉద్దేశాలు, అవకాశం ఉందని యూరోపియన్ దేశాలు ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి. ఈ విషం వినియోగం రసాయన ఆయుధాల కన్వెన్షన్ ఉల్లంఘన కింద వస్తుందని పేర్కొంటూ ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్‌(OPCW )కు నివేదిస్తున్నట్టు తెలిపాయి.

నావల్నీ భార్య యుతియా నవల్నాయ శనివారం నాడు మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. నా భర్తను పుతిన్ హత్య చేశాడని నేను అప్పుడే చెప్పానని, నా మాటలకు ఇప్పుడు శాస్త్రీయంగా నిరూపితమయ్యాయని అన్నారు. 2024 ఆర్కిటిక్ జైలులో నావల్ని అనుమానస్పద స్థితిలో మరణించాడు. వాకింగ్ వెళ్లి వచ్చిన తర్వాత అస్వస్థకు గురై మరణించినట్లు రష్యన్ అధికారులు చెప్పారు, ఇది సహజ మరణమే అని వెల్లడించారు. అయితే, పాశ్చాత్య దేశాలు మాత్రం ఈ వాదనల్ని నమ్మలేదు.

Exit mobile version