Site icon NTV Telugu

Cuba: అంధకారంలో క్యూబా.. ఇబ్బందులు పడుతున్న కోటి మంది..

Cuba

Cuba

Cuba: క్యూబా దేశంలో ఒక్కసారిగా అంధకారం ఏర్పడింది. దేశంలోని ప్రధాన విద్యుత్‌ ప్లాంట్‌లలో ఒకటి ఫెయిల్ కావడంతో జాతీయ పవర్‌ గ్రిడ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆ దేశంలో తీవ్ర విద్యుత్‌ సంక్షోభం తలెత్తిందని అక్కడి విద్యుత్‌ శాఖ మంత్రి ప్రకటించారు. కరెంట్ లేకపోవడంతో దేశంలోని స్కూల్స్ అన్నింటినీ బంద్ చేసినట్లు వెల్లడించారు. అత్యవసరం కానీ పరిశ్రమలను మూసి వేసి కార్మికులను తమ ఇళ్లకు పంపించేశారు. ఇక, పవర్‌ ప్లాంట్‌ విఫలం కావడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Read Also: IND vs NZ: ఓటమి ఉచ్చులోనే భారత్.. ఈరోజు నిలబడితేనే..! ఆశలన్నీ ఆ ఇద్దరిపైనే

ఇక, విద్యుత్‌ పునరుద్ధరణ చర్యలు చేపట్టే వరకు సంబంధిత అధికారులు రెస్ట్ తీసుకోవద్దని క్యూబా అధ్యక్షుడు మిజిల్‌ డియాజ్‌ కేనల్‌ ఆదేశాలు జారీ చేశారు. ఒక్కసారిగా ఆహారం, నీళ్లు, ఇంధనం, ఔషధాల సరఫరా దెబ్బతినడంతో దాదాపు కోటి మంది క్యూబా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రమైన ఉక్కపోతతో ద్వీప దేశ వాసులు, పర్యటకులు అల్లాడి పోతున్నారు. పునరుద్ధరణ చర్యలు చేపట్టినప్పటికీ విద్యుత్‌ సరఫరా ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు.

Exit mobile version