Site icon NTV Telugu

America Shooting: అమెరికాలో మళ్లీ పేలిన గన్.. నలుగురు మృతి

America Shooting

America Shooting

America Shooting: అమెరికాలో గన్‌కల్చర్‌ రోజురోజుకు పెరిగిపోతోంది. వరుస కాల్పుల ఘటనలు అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా డేటన్‌కు ఉత్తరాన ఉన్న ఒహియోలోని బట్లర్‌ టౌన్‌షిప్‌లో మరో సారి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఆయుధాలతో దుండగుడు కారులో సంచరిస్తూ పలు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడినట్లు వెల్లడించారు. కాల్పులకు తెగిబడిన ఆ నిందితుడి కోసం ప్రస్తుతం తీవ్రంగా గాలిస్తు్న్నారు.

నిందితుడిని స్టీఫెన్‌ మార్లోగా అనుమానిస్తున్నట్లు బట్లర్ టౌన్‌షిప్ పోలీస్ చీఫ్ జాన్ పోర్టర్ వెల్లడించారు. దుండగుడు మారణాయుధాలతో ఉన్న నేపథ్యంలో ఎక్కడైనా కనిపించినా.. దగ్గరకు వెళ్లొద్దని పోలీసులు హెచ్చరించారు. అతడు ప్రయాణిస్తున్నట్లుగా చెబుతున్న కారుకు సంబంధించిన ఫొటోను పోలీసులు విడుదల చేశారు. దుండగుడు ఏ లక్ష్యంతో కాల్పులు జరిపాడన్నది ఇంకా స్పష్టత రాలేదని పోలీసు అధికారులు వెల్లడించారు. నిందితుడికి ఇండియానా పోలీస్‌, షికాగో, లెక్సింగ్టన్‌, కెంటకీ నగరాలతో కూడా సంబంధాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో ఈ నగరాల్లో ఎక్కడో ఒక చోట ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు. మన్రో ఇప్పటికే పలు కేసుల్లో శిక్ష అనుభవించి విడుదలైనట్లు పోలీసులు గుర్తించారు.

Israel Strikes: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు.. 24కు చేరిన మృతుల సంఖ్య

నిందితుడు స్టీఫెన్ మార్లో గురించి పోలీసులు పలు వివరాలు వెల్లడించారు. అతని వయస్సు 39 సంవత్సరాలని, ఎత్తు 5’11” అడుగులు, బరువు దాదాపు 160 పౌండ్లు, గోధుమ రంగు జుట్టుతో ఉంటాడని చెప్పారు. ఘటన జరిగిన సమయంలో మార్లో పసుపు రంగు టీ-షర్టు ధరించి తెల్లటి 2007 ఫోర్డ్ ఎడ్జ్‌ కారులో పారిపోయినట్లు చెప్పారు. అతని ఆచూకీ తెలిస్తే ఎఫ్‌బీఐని సంప్రదించాలని అధికారులు వెల్లడించారు.

Exit mobile version