NTV Telugu Site icon

Pakistan: బలూచిస్థాన్‌లో పలు చోట్ల బాంబు పేలుళ్లు.. ఐదుగురు సైనికులు దుర్మరణం

Pakistan

Pakistan

Multiple blasts in Pakistan’s Balochistan kill five:పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఆదివారం బలూచిస్థాన్ ప్రావిన్సులో పలు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు పాకిస్తాన్ సైనికులు మరణించారు. 12 మంది పౌరులు గాయపడ్డారు. డిసెంబర్ 24 నుంచి పాక్ ఆర్మీ, ఇతర భద్రతా బలగాలు బలూచిస్తాన్ వ్యాప్తంగా ఇంటలిజెన్స్ సమాచారంతో ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో కోహ్లు జిల్లాలోని కహాన్ ప్రాంతంలో ఐఈడీ పేలింది. క్వెట్టాలోని శాటిలైట్ టౌన్ లోని పోలీస్ చెక్ పాయింట్ వద్ద మరో ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు గ్రేనేడ్ విసిరేసి పరారయ్యారు. ముగ్గురు పోలీసు అధికారులు, ఐదుగురు పౌరులతో సహా 8 మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే క్వెట్టాలోని మరో ప్రాంతంలో గ్రెనేడ్ పేలడంతో నలుగురు గాయపడ్డారు. దేశం మొత్తం క్రిస్మస్ వేడకలు జరుపుకుంటుంటే.. బలూచిస్థాన్ లో వరసగా పేలుళ్లు జరిగాయి.

Read Also: Pushpa Kamal Dahal: నేపాల్ ప్రధానిగా ప్రచండ.. ముగిసిన సంక్షోభం

ఇటీవల కాలంలో పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. బలూచిస్థాన్ లో బలూచ్ లిబరేషన్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) వరసగా పాకిస్తాన్ సైనికులపై దాడులు చేస్తోంది. పాక్ సైనికులు, చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులో పనిచేస్తున్న చైనీయులను టార్గెట్ చేస్తోంది. చాలా వరకు బలూచిస్థాన్ల్ లో ఈ సంస్థే చేస్తోంది. పాకిస్తాన్ నుంచి బలూచిస్థాన్ కు విముక్తి కల్పించడమే ఈ సంస్థ లక్ష్యం. మరోవైపు పాకిస్తాన్ గిరిజన ప్రాంతం అయిన కైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) దాడులను పెంచింది. ఇటీవల కాలంలో ఆఫ్ఘన్ సరిహద్దులో కూడా పాకిస్తాన్ పై ఆఫ్ఘన్ తాలిబన్లు దాడులు చేస్తున్నాయి. డ్యూరాంగ్ రేఖపై ఇరుదేశాల మధ్య విభేదాల నేపథ్యంలో సరిహద్దుల్లో దాడులు జరుగుతున్నాయి.

Show comments