NTV Telugu Site icon

Italy: ఇటలీ పార్లమెంట్‌లో ఎంపీల ఫైట్..జీ-7కి ముందు ఘటన..

Italy

Italy

Italy: ప్రతిష్టాత్మక జీ-7 సమ్మిట్‌కి ఇటలీ వేదిక అవుతుంది. ఈ సమావేశం కోసం ప్రధాని నరేంద్రమోడీతో పాటు జీ-7 సభ్యదేశాల దేశాధినేతలు ఇప్పటికే అక్కడి చేరుకున్నారు. వీరందరిని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సాదరంగా ఆహ్వానించారు. ఇదిలా ఉంటే ఈ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఇటలీ పార్లమెంట్‌లో ఎంపీలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది.

Read Also: Priyanka Gandhi: వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ పోటీ..?

పలు ప్రాంతాలకు మరింత స్వయంప్రతిపత్తి కల్పించాలని రైటిస్ట్ గవర్నమెంట్ ప్లాన్ చేయడంతో రగడ మొదలైంది. దీనిని కొందరు ఫాసిజం రోజులతో పోల్చారు. ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్ (MS5) డిప్యూటీ లియోనార్డో డోన్నో, ప్రో-అటానమీ నార్తర్న్ లీగ్‌కు చెందిన ప్రాంతీయ వ్యవహారాల మంత్రి రాబర్టో కాల్డెరోలీ మెడలో ఇటాలియన్ జెండాను కట్టడానికి ప్రయత్నించిన తర్వాత బుధవారం సాయంత్రం ఈ గొడవ జరిగింది. ఇటలీలో మరిన్ని ప్రాంతాలకు స్వయంప్రతిపత్తిని కల్పించే ప్రణాళికను ఖండించేందుక డోన్నో ఈ చర్యకు పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా కాల్డెరోలీ అతని సహచరులు డోల్నోపై దాడి చేశారు. ఈ గొడవల్లో గాయపడిన డోన్నోని ఆసుపత్రికి పంపే ముందు వీల్ చైర్‌లో తరలించాల్సి వచ్చింది.

ఈ వార్త ఇటాలియన్ పత్రికల్లో హెడ్‌లైన్‌గా మారింది. పార్లమెంట్ ‘‘బాక్సింగ్ రింగ్’’గా మారిందని మీడియా కథనాలను ప్రచురించాయి. ప్రధాని జార్జియా మెలోని పార్టీ లీగ్ అండ్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ డోన్నోపై తీవ్ర విమర్శలు చేసింది. కావాలనే రెచ్చగొట్టాడని, అతని గాయాలు నకిలీవని పేర్కొన్నారు. అయితే M5S ఈ దాడిని తీవ్రమైన అవమానకరమైన దాడిగా ఖండించింది. తక్షణ చర్యలకు పిలుపునిచ్చింది. విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ చట్టసభ సభ్యులు తమను తాము ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉంచుకోవాలని కోరారు.
https://twitter.com/AsafGivoli/status/1801182587383087600