More classified documents found from US President Biden’s residence, private office: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంట్లో మరన్ని రహస్య పత్రాలను కనుక్కున్నట్లు వైట్ హౌజ్ గురువారం తెలిపింది. ఈ రహస్య పత్రాలు అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. వీటిపై విచారణ ప్రారంభం అయింది. వాషింగ్టన్ లోని బైడెన్ ప్రైవేటు ఆఫీస్ నుంచి ఈ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ రహస్య పత్రాలన్నీ జో బైడెన్ 2009-16 మధ్య ఉపాధ్యక్షుడిగా ఉన్న కాలానికి చెందినవని తేలింది. గతేడాది మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంట్లోకి ఎఫ్బీఐని పంపించి దాడులు చేయించింది బైడెన్ సర్కార్. ఈ దాడుల్లో సీక్రెట్ డాక్యుమెంట్లు బయటపడ్డాయి. 2024 ఎన్నికల్లో పాల్గొనకుండా ట్రంప్ ను నిలువరించేందుకు ఈ దాడులు ఉపయోగపడుతాయని భావించారు బైడెన్. అయితే అనూహ్యంగా బైడెన్ కూడా ఇలాంటి చిక్కుల్లోనే ఇరుక్కోవడంతో అక్కడి ప్రతిపక్షం రిపబ్లిక్ పార్టీ బైడెన్ పై దుమ్మెత్తిపోస్తున్నాయి.
Read Also: Sharad Yadav: మాజీ కేంద్రమంత్రి శరద్ యాదవ్ కన్నుమూత
గత నవంబర్ నెలలో బైడెన్ ప్రైవేటు నివాసం అయిన పెన్ బైడెన్ సెంటర్లో సీక్రెట్ డాక్యుమెంట్స్ బయటపడిన సంగతి తెలిసిందే. తాజాగా మరిన్ని పత్రాలు దొరకడం అమెరికాలో కలకలం సృష్టించాయి. ప్రస్తుతం దొరికిన డాక్యుమెంట్లు ఉక్రెయిన్, బ్రిటన్, ఇరాన్ దేశాలకు చెందినవి. ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉక్రెయిన్ విధాన నిర్ణయాలను జోబైడెన్ చూసేవారు. అయితే ఈ పత్రాలు ఎలా వచ్చాయో తనకు తెలియదని జో బైడెన్ చెబుతున్నా.. ఇది ఇంతటితో ఆగేలా లేదు. న్యాయశాఖకు పూర్తిగా సహకరిస్తాని జో బైడెన్ చెబుతున్నారు.
అయితే ఈ వ్యవహారం వచ్చే అధ్యక్ష ఎన్నికలపై తప్పక ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ కు వీటితో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని చైనా, ఉక్రెయిన్ కంపెనీలో లావాదేవీలు జరిపి డబ్బు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారంపై యూఎస్ కాంగ్రెస్ దర్యాప్తు చేయాలని హౌస్ స్పీకర్ కెవిన్ మెక్ కార్తీ గురువారం అన్నారు.