NTV Telugu Site icon

Monkeypox: పెరిగిన మంకీపాక్స్ కేసులు.. 59 దేశాలకు పాకిన వైరస్

Monkeypox Virus

Monkeypox Virus

వేగంగా వ్యాప్తి చెందుతోన్న మంకీపాక్స్ కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గతవారం కన్నా ఈ వారం మంకీపాక్స్‌ కేసులు 77 శాతం పెరిగాయనీ, ఆఫ్రికాలో ఈ వైరస్‌ సోకి ఇద్దరు చనిపోయారని డబ్ల్యూహెచ్‌వో గురువారం తెలిపింది. ఇప్పటివరకు 59 దేశాలకు పాకిన వైరస్‌.. 6వేల మందిలో నిర్ధారణ అయ్యింది. జూన్‌ 27తో పోలిస్తే ఈ వారం అదనంగా 2,614 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకొని 59 దేశాల్లో మొత్తం 6,027 కేసులు నిర్ధారణ అయ్యాయని సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఈ వ్యాధి కారణంగా తాజాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య మూడుకు చేరింది.

Raj Babbar: ప్రముఖ పొలిటీషియన్, బాలీవుడ్ యాక్టర్ కు రెండేళ్లు జైలు శిక్ష

మంకీపాక్స్‌ కేసులు అత్యధికంగా ఐరోపా, అమెరికా, ఆఫ్రికాలలో కనిపిస్తున్నాయని వివరించింది. ఆఫ్రికాలో చిరకాలంగా ఎలుకలు, చిన్న జంతువులు మనుషులను కరవడం వల్ల మంకీ పాక్స్‌ వైరస్‌ సోకుతుంటే, అమెరికా, ఐరోపాలలో స్వలింగ సంపర్కులైన పురుషుల్లో వైరస్‌ వ్యాపిస్తోంది. అక్కడ మే నెల నుంచి కేసులు కనిపిస్తున్నాయి. ఇంతవరకు 80 శాతం మంకీపాక్స్‌ కేసులు ఐరోపా దేశాల్లోనే తలెత్తాయనీ, ఇది చాలా ఆందోళనకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్ అధనామ్ గేబ్రియేసస్ వెల్లడించారు. ఈ వ్యాధి వ్యాప్తిపై నిఘా వేసిన తమ సంస్థ బృందం ఈ నెల ద్వితీయార్ధంలో సమావేశమవుతుందని చెప్పారు. ఈ వ్యాధి ప్రాబల్యంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నామని ఆయన వివరించారు.