Mojtaba Khamenei: వదంతుల వేళ మోజ్తాబా వీడియో విడుదల.. కొత్త సుప్రీం లీడర్ ఎలా ఉన్నారంటే..!
- వదంతుల నేపథ్యంలో మోజ్తాబా వీడియో విడుదల
- మత ప్రబోధ కార్యక్రమంలో కనిపించిన మోజ్తాబా
- వీడియోపై కొత్త ఊహాగానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్ దాడుల్లో హతం అయ్యాక.. ఆయన కుమారుడు మోజ్తాబా కొత్త సుప్రం లీడర్‌గా నియమితులయ్యారు. కానీ ఇప్పటి వరకు బహిరంగంగా కనిపించలేదు. దీంతో మోజ్తాబా పరిస్థితి కూడా సీరియస్‌గా ఉందని.. రష్యాలో చికిత్స అందిస్తున్నారని రకరకాలైన ఊహాగానాలు వినిపించాయి. ఇంతలోనే మోజ్తాబా ఆచూకీ చెబితే రూ.94 కోట్ల రివార్డ్ ఇస్తామని అగ్ర రాజ్యం అమెరికా ప్రకటించింది. ఇక మోజ్తాబాను కూడా చంపేస్తామంటూ ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది.
ఇలాంటి ఊహాగానాల మధ్య తాజాగా ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్ (IRIB) సంస్థ మోజ్తాబా ఖమేనీకి సంబంధించిన ఒక అరుదైన వీడియోను విడుదల చేసింది. ఒక హాల్లో మత ప్రబోధ కార్యక్రమంలో ప్రసంగిస్తున్నట్లుగా మోజ్తాబా కనిపించారు. అయితే ఈ వీడియో తాజా వీడియోనేనా? లేదంటే పాత వీడియోనో క్లారిటీ లేదు. ఈ వీడియోలో మాత్రం మోజ్తాబా బాగానే ఉన్నట్లుగా కనిపించారు.
Also Read
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
అయితే వీడియోను బట్టి చూస్తుంటే ఫుటేజ్ పాతదిగా కనిపిస్తోంది. సుప్రీం లీడర్‌గా నియమించిన దగ్గర నుంచి మోజ్తాబా ఖమేనీకి సంబంధించిన ఏ బహిరంగ వీడియో కూడా విడుదల కాలేదు. అయితే మోజ్తాబా ఆరోగ్యంపై రకరకాలైన వదంతులు వస్తున్న నేపథ్యంలో ఈ వీడియో విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Gold Rates: యుద్ధం వేళ నేటి బంగారం, వెండి ధరలు ఇలా..!
ఫిబ్రవరి 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. అంతేకాకుండా ప్రభుత్వంలోని అనేక మంది కీలక నేతలు కూడా చనిపోయారు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేయడంతో ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్, చమురు సంక్షోభం తలెత్తింది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో భీకర స్థాయిలో యుద్ధం జరుగుతోంది.
ఇది కూడా చదవండి: Stock Market: హమ్మయ్య.. తేరుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
తాజావార్తలు
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!