Modi-Meloni: ఇటలీ ప్రధానిగా మెలోని రికార్డ్.. మోడీ అభినందనలు.. రిప్లై ఇదే!
- ఇటలీ ప్రధానిగా మెలోని రికార్డ్
- అత్యంత సుదీర్ఘకాలం వరుసగా ప్రధానమంత్రిగా చరిత్ర
- మోడీ అభినందనలు.. మెలోని రిప్లై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటలీ యుద్ధానంతర చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం వరుసగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నేతగా జార్జియా మెలోని రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై స్పందించిన మెలోని.. భారత్-ఇటలీ సంబంధాలు “గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయి” అని పేర్కొన్నారు.
మోడీకి మెలోని ధన్యవాదాలు
ఎక్స్ వేదికగా మెలోని స్పందిస్తూ.. తనకు శుభాకాంక్షలు తెలిపినందుకు మోడీకి కృతజ్ఞతలు చెప్పారు. మోడీతో ఉన్న స్నేహాన్ని కూడా ప్రస్తావించారు. “ప్రియమైన నరేంద్ర మోడీ.. మీ మాటలకు, మీ స్నేహానికి ధన్యవాదాలు. భారత్, ఇటలీ మధ్య సంబంధాలు ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయి” అని పేర్కొన్నారు. భారత్, ఇటలీ మధ్య ఇటీవల ప్రారంభించిన స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ రెండు దేశాల మధ్య బంధం ప్రాధాన్యతను తెలియజేస్తోందని గుర్తుచేశారు. ఇరు దేశాల నైపుణ్యాలను కలిపి కొత్త అవకాశాలను సృష్టించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని పేర్కొన్నారు.
Also Read
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
మెలోనికి మోడీ శుభాకాంక్షలు
అంతకుముందు ప్రధాని మోడీ.. జార్జియా మెలోని చారిత్రక ఘనత సాధించిన సందర్భంగా అభినందనలు తెలిపారు. ఇటలీ యుద్ధానంతర చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం వరుసగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నేతగా మెలోని నిలిచారని పేర్కొన్నారు. ఈ ఘనత ఇటలీ ప్రజలకు మెలోని నాయకత్వంపై ఉన్న నమ్మకం, విశ్వాసానికి నిదర్శనమని అభివర్ణించారు. భారత్-ఇటలీ స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్‌ను బలోపేతం చేయడంలో మెలోని స్నేహం కీలకంగా ఉందని పేర్కొన్నారు. భారత్, ఇటలీ ప్రజల కోసం సంపన్నమైన భవిష్యత్తును నిర్మించేందుకు మెలోనితో కలిసి సన్నిహిత సహకారాన్ని కొనసాగించేందుకు ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలిపారు. ఆమె భవిష్యత్తు విజయాలకు శుభాకాంక్షలు చెప్పారు.
Grazie, caro @narendramodi, per le tue parole e per la tua amicizia.
Il rapporto tra Italia e India è oggi più forte che mai 🇮🇹🇮🇳Il Partenariato Strategico Speciale che abbiamo lanciato durante il nostro ultimo incontro è il riconoscimento dell’importanza di questo legame e… https://t.co/7xQgo7RbvH
— Giorgia Meloni (@GiorgiaMeloni) September 4, 2026
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?