అగ్ర రాజ్యం అమెరికా హెచ్చరించినట్లుగానే ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేయడం మొదలు పెట్టింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారులు ధృవీకరించారు. మరోవైపు ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సన్నద్ధమైంది. ఇరాన్ వ్యూహాలను తిప్పికొట్టే ప్రయత్నంలో ఉంది.
ఇది కూడా చదవండి: UP: యూపీలో దారుణం.. డెలివరీ బాయ్‌ను చంపి రూ.90వేల ఫోన్లు అపహరణ
ఇదిలా ఉంటే ఇరాన్ కాలు దువ్వితే.. ప్రతీకార దాడులు తప్పవని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించింది. తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇరాన్ చర్యలను వైట్‌హౌస్ ముందే కనిపెట్టింది. ఇరాన్ క్షిపణి దాడులు చేయొచ్చని హెచ్చరించింది. అంతేకాకుండా ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఇరాన్‌కు గట్టిగా బుద్ధి చెబుతామని కూడా వైట్‌హౌస్ స్పష్టం చేసింది.
హిజ్బు్ల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం తర్వాత ఇరాన్ పగతో రగిలిపోతుంది. ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించింది. అన్నట్టుగానే మంగళవారం ఇజ్రాయెల్‌పై దాడులు మొదలు పెట్టింది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ సైన్యం కూడా లెబనాన్ రాజధాని బీరుట్‌లో కూడా మంగళవారం భీకర దాడులు చేస్తూనే ఉంది. అంతేకాకుండా లెబనాన్ ప్రజలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. మొత్తానికి పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఇది కూడా చదవండి: SEBI: వీడియోకాన్ కేసులో ధూత్‌కు షాక్.. రూ.కోటి నోటీసు