Site icon NTV Telugu

US Video: మహిళపై పిడిగుద్దులు.. లొంగిపోయిన మిలియనీర్ బ్యాంకర్ జోనాథన్

Attcak

Attcak

గత నెలలో న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌ ప్రైడ్ ఈవెంట్‌లో మహిళపై మిలియనీర్ బ్యాంకర్ జోనాథన్ కేయ్ దాడికి తెగబడ్డాడు. పిడిగుద్దుల వర్షం కురిపించడంతో ఆమె నేలపై పడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటన నెట్టింట వైరల్ అవ్వడంతో అతని బ్యాంక్ వేటు వేసింది. అలాగే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. నిరసనలు తీవ్రం కావడంతో జోనాథన్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

ఇది కూడా చదవండి: UP Stampede: ఘోర విషాదం.. యూపీ తొక్కిసలాటలో 80 పైగా మృతి..

52 ఏళ్ల కేయ్.. జూన్ 8న బ్రూక్లిన్ ప్రైడ్ ఈవెంట్‌లో మహిళపై దాడి చేశాడు. ముఖంపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె కిందపడిపోయింది. 38 ఏళ్ల మహిళ.. కేయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముక్కు, కన్ను దెబ్బతిన్నట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. అయితే అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్ పెరిగింది. దీంతో అతడు.. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ పదవికి రాజీనామా చేసి.. పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇదిలా ఉంటే దాడికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇది కూడా చదవండి: PM Modi: దేశాన్ని జూన్ 4న తగలబెట్టాలనుకున్నారు.. కాంగ్రెస్ ఒక పరాన్నజీవి..

Exit mobile version