Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mexico Gun Attack: మెక్సికోలో డ్రగ్ కార్టెల్స్ (ముఠా హింస) మరోసారి రక్తపాతం సృష్టించాయి. మెక్సికో తూర్పు – మధ్య రాష్ట్రమైన ప్యూబ్లాలోని టెహుయిట్జింగో పట్టణంలో సాయుధ దుండగులు జరిపిన ఘోర కాల్పుల్లో ఒక చిన్నారితో సహా 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం తెల్లవారుజామున ఒక నివాస గృహమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ప్యూబ్లా ప్రజా భద్రతా సంస్థ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి
స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం.. మరణించిన వారిలో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలతో పాటు ఒక చిన్నారి ఉన్నారు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు సమాచారం అందించడంతో మున్సిపల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలైన ఒక మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూసింది. అయితే ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు ఎవరు? వారి మోటివ్ ఏంటి? అనే విషయాలను స్థానిక అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఈ ఘాతుకంపై ఫెడరల్ అధికారులు, నేషనల్ గార్డ్ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read
- Strait of Hormuz: హోర్ముజ్ నుంచి యెమెన్ వరకు హైటెన్షన్.. 86 షిప్స్‌కు అమెరికా బ్రేక్!
- Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్‌పోర్ట్‌కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
భయంతో పారిపోతున్న వందలాది కుటుంబాలు
మధ్య మెక్సికోలో ఇటీవల కాలంలో కార్టెల్ ముఠాల మధ్య ఆధిపత్య పోరు తీవ్రరూపం దాల్చింది. ఈ ప్రాంతంలో అకస్మాత్తుగా పెరిగిన హింస కారణంగా స్థానిక ప్రజల్లో భయాందోళనలు తీవ్రం అవుతున్నాయి. దీంతో వారు వారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఇప్పటికే సుమారు 800 నుంచి 1,000 కుటుంబాలు వారి ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస పారిపోయారు. ఇంతటి దారుణమైన ఘటన జరిగినప్పటికీ ప్యూబ్లా గవర్నర్ అలెజాండ్రో అర్మెంటా ఇప్పటివరకు దీనిపై స్పందించకపోవడం గమనార్హం.
వరుస హత్యలతో అల్లాడుతున్న ప్యూబ్లా
చాలాకాలంగా ఈ ప్రాంతం ముఠా హింసతో అట్టుడుకుతుంది. తాజాగా జరిగిన దాడి ఈ ఏడాది ప్యూబ్లా రాష్ట్రంలో జరిగిన మూడో పెద్ద సాయుధ దాడిగా చెబుతున్నారు. ఫిబ్రవరిలో ప్యూబ్లాలోని ‘హుహుఎట్లాన్ ఎల్ గ్రాండే’ నగరంలో దుండగుల చేతిలో ఆరుగురు హత్యకు గురయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ప్యూబ్లా రాజధాని నగరంలో ఒక వాహనంపై జరిగిన దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ముఠా హింసను అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని భద్రతా సంస్థలు స్పష్టం చేశాయి.
తాజావార్తలు
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
-
Romanchakam Overseas Review : రోమాంచకం ఓవర్సీస్ ప్రీమియర్ రివ్యూ
-
Chamari Athapaththu: కెప్టెన్ సంచలనం.. 5 పరుగులిచ్చి 7 వికెట్లు డౌన్..! హ్యాట్రిక్ కూడాను..
-
Strait of Hormuz: హోర్ముజ్ నుంచి యెమెన్ వరకు హైటెన్షన్.. 86 షిప్స్‌కు అమెరికా బ్రేక్!
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని ధన లాభాలు!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!