Site icon NTV Telugu

Plane Crash: మెక్సికోలో కూలిన విమానం.. ప్రముఖ టీవీ హోస్ట్ డెబోరా ఎస్ట్రెల్లా మృతి

Plane Crash

Plane Crash

విమాన ప్రమాదంలో ప్రముఖ మెక్సికన్ టీవీ హోస్ట్ డెబోరా ఎస్ట్రెల్లా(43) హఠాన్మరణం చెందింది. విమాన ట్రైనింగ్ పొందుతుండగా ఈ ఘోరం జరిగింది. తక్కువ ఎత్తులోనే విమానం ఎగురుతుండగానే కూలిపోయింది. పార్క్ ఇండస్ట్రియల్ సియుడాడ్ మిత్రాస్‌పైకి దూసుకెళ్లినట్లు చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Supreme Court: ప్రజా ధనాన్ని విగ్రహాలకు ఎలా ఖర్చు చేస్తారు? డీఎంకే ప్రభుత్వానికి చీవాట్లు

డెబోరా ఎస్ట్రెల్లా 2018 నుంచి మల్టీమీడియో టెలివిజన్‌లో పని చేస్తోంది. అయితే ఆమె న్యూవో లియోన్‌లో విమాన ట్రైనింగ్ పొందుతోంది. శనివారం ట్రైనింగ్ పొందుతుండగా విమానం తక్కువ ఎత్తులోనే ఉంది. అయితే ఉన్నట్టుంగా వేగంగా నేలపైకి దూసుకొచ్చి కూలిపోయింది. దీంతో ట్రైనర్ బ్రయాన్ లియోనార్డో బాలేస్టెరోస్ అర్గుటాతో పాటు డెబోరా ఎస్ట్రెల్లా మరణించారు.

ఇది కూడా చదవండి: Bengaluru: దారుణం.. కూతురు ఎదురుగా భార్యను చంపిన భర్త.. కారణమిదే!

పెస్క్వేరియా నది సమీపంలో సాయంత్రం 6:50 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. సంఘటనాస్థలిలోనే ఇద్దరూ చనిపోయారని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏరోనాటిక్స్, రాష్ట్ర ప్రాసిక్యూటర్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించాయి.

ఇది కూడా చదవండి: DK Shivakumar: మోడీ నివాసం దగ్గర గుంతలు లేవా? కర్ణాటకలోనే ఉన్నాయా? డీకే.శివకుమార్ ఎదురుదాడి

మోంటెర్రీలో ప్రసారమయ్యే టెలిడియారియో డెల్ మట్టినోను హోస్ట్ చేయడం ద్వారా ఆమె గుర్తింపు పొందింది. వారాంతాల్లో ఆమె మిలెనియో టెలివిజన్‌తో కూడా కలిసి పనిచేస్తోంది. ఇక ఆమె మరణంపై మల్టీ మీడియా దిగ్భ్భాంతిని వ్యక్తం చేసింది. ఇక ఆమె మరణవార్త తెలియగానే అభిమానులు సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేస్తున్నారు.

 

Exit mobile version