NTV Telugu Site icon

Pakistan: పాక్‌లో టెన్షన్‌, టెన్షన్‌.. మెట్రో స్టేషన్‌కు నిప్పు..

Pakistan

Pakistan

పొలిటికల్‌ డ్రామా మధ్య పాకిస్థాన్‌ ప్రధాని పదవి కోల్పోయారు ఇమ్రాన్‌ ఖాన్‌.. అయితే, అవిశ్వాత తీర్మానం తర్వాత అధికారాన్ని కోల్పోయిన ఇమ్రాన్‌.. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు.. దీనిపై ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ర్యాలీతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. ర్యాలీకి భారీ సంఖ‍్యలో తరలివచ్చారు ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతుదారులు.. ఈ సందర్భంగా పీటీఐ పార్టీ మద్దతుదారులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది.. ఆందోళనకారులను చెదరగట్టేందుకు పంజాబ్ ప్రావిన్స్‌లో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు, కొందరిని చెదరగొట్టారు.

Read Also: Samajika Nyaya Bheri: వైసీపీ `సామాజిక న్యాయ భేరి`

ఇక, పోలీసుల చర్యతో మరింత రెచ్చిపోయారు పీటీఐ పార్టీ శ్రేణులు, ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతుదారులు.. చైనా చౌక్‌ మెట్రోస్టేషన్‌కు, అక్కడున్న చెట్లకు నిప్పుపెట్టారు.. ఇదే సమయంలో.. పీటీఐ పార్టీకి చెందిన ఓ వ్యక్తి మృతిచెందడం కలకలం రేపుతోంది.. ఫైసల్ అబ్బాస్ చౌదరి అనే వ్యక్తి వంతెనపై నుండి పడి మృతి చెందినట్ట పోలీసులు చెబుతుండగా.. అసలు పోలీసులే అతడిని వంతెనపై నుంచి తోసేశారని పీటీఐ నేతలు ఆరోపిస్తున్నారు.

కాగా, ఏప్రిల్‌లో పాక్‌ ప్రధానమంత్రి పదవి నుండి తొలగించబడిన ఇమ్రాన్ ఖాన్, తాజా ఎన్నికలను డిమాండ్ చేయడానికి ఇస్లామాబాద్‌లోని డి-చౌక్‌లో ‘శాంతియుత’ నిరసన ర్యాలీ కోసం తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. దేశ రాజధానిలో నిరసన ర్యాలీని అనుమతించాలని పాకిస్తాన్ యొక్క సుప్రీం కోర్ట్ అధికారులను ఆదేశించిన తరువాత మరియు రాజకీయవేత్తగా మారిన క్రికెటర్‌ను అరెస్టు చేయకుండా వారిని నిరోధించిన తర్వాత అతని నిరసనకు పిలుపునిచ్చారు.. అయితే, ఆందోళనకారులు వేలాదిగా గుమిగూడి బారికేడ్లను తొలగించడంతో పోలీసులతో ఘర్షణకు దారితీసింది. ఆ తర్వాత విధ్వంసానికి పాల్పడ్డారు.