NTV Telugu Site icon

New Study: ‘‘జ్ఞాపకాలు మెదడుకు మాత్రమే పరిమితం కావు’’.. శరీరంలో ఇతర భాగాల్లో మెమోరీ ఫంక్షన్స్..

New Study

New Study

New Study: జ్ఞాపకశక్తి అనేది కేవలం మెదడుకు మాత్రమే పరిమితం కాకపోయి ఉండొచ్చని కీలక అధ్యయనం వెల్లడించింది. న్యూయార్క్ యూనివర్శిటీ (NYU)లోని శాస్త్రవేత్తలు జ్ఞాపకశక్తి పనితీరు మెదడు కణాలకు ప్రత్యేకంగా ఉండకపోవచ్చని సూచించే పరిశోధనను వెల్లడించారు. శరీరంలో మెదడు కణాలు కానీ చాలా ప్రాంతాల్లో కూడా జ్ఞాపకాలను నిల్వ చేసుకుంటున్నట్లు కనుగొన్నారు.

మెదడు కణాలు కాకుండా, ప్రత్యేకంగా మూత్రపిండాలు, నరాల కణజాల కణాలు కూడా మెమోరీలను నిల్వ చేసుకుంటున్నట్లు వెల్లడించారు. సాధారణంగా న్యూరాన్లతో సంబంధం ఉన్న జ్ఞాపకశక్తి వంటి లక్షణాలను కలిగి ఉన్నాయని అధ్యయనం నిరూపించింది. ఈ పరిశోధనలను జ్ఞాపకశక్తి ప్రక్రియలకు సంబంధించిన మరిన్ని వివరాలను వెలికితీసేందుకు కారణమవుతాయి. జ్ఞాపకశక్తి ప్రక్రియల సంబంధించి కొత్త ట్రీట్మెంట్‌లకు దారి తీస్తాయి.

Read Also: Maharashtra Polls: సీఎం ఏక్‌నాథ్‌షిండే, అజిత్ పవార్ బ్యాగ్‌లు తనిఖీ.. సహకరించిన అగ్ర నేతలు

ఈ అధ్యయనాన్ని నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించారు. అధ్యయనం ప్రకారం.. పరిశోధన బృందం ప్రయోగశాల మెదడు కణాలు కాని ఇతర కణాల రసాయన సిగ్నల్స్ నమూనాలను, ప్రతిస్పందనల్ని పరిశీలించారు. న్యూరో లాజికల్‘‘మాస్ స్పెస్డ్ ఎఫెక్ట్’’ ని అంగీకరించడం ద్వారా, ఈ కణాలు గుర్తించుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందో లేదో పరీక్షించడానికి శాస్త్రవేత్తల టీం పరిశోధనలు జరిపింది. కిడ్నీ, నరాలకు సంబందించిన కణాలు గుర్తుంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది.

ఈ అధ్యయనం సెల్యూలార్ మెమోరీపై కొత్త విషయాలను పరిచయం చేసింది. మెదడు యేతర కణాలను మెమోరీ నిల్వ, పనితీరును సమగ్రంగా పరిగణించడానికి భవిష్యత్ పరిశోధనలను మార్చగలదు. నాన్-న్యూరల్ మెమరీని అర్థం చేసుకోవడం నేర్చుకోవడాన్ని మెరుగుపరచడానికి లేదా గ్లూకోజ్ నిర్వహణ , క్యాన్సర్ కణాల ప్రతిస్పందన వంటి ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి వినూత్న చికిత్స విధానాలను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందని సైంటిస్టులు సూచిస్తున్నారు.

Show comments