Site icon NTV Telugu

Meenakshi Lekhi: జమ్మూ కాశ్మీర్‌పై పాకిస్థాన్‌కు హక్కు లేదు.. ముందు మీ దేశం పరిస్థితి చూసుకోండి

Meenakshi Lekhi

Meenakshi Lekhi

Meenakshi Lekhi comments on pakistan: పాకిస్తాన్ దేశానికి మరోసారి మాడ పగిలే సమాధానం ఇచ్చింది ఇండియా. పదే పదే ప్రపంచ వేదికలపై జమ్మూ కాశ్మీర్, భారత్ తో మైనారిటీలు అణచివేతకు గురవుతున్నారంటూ పాకిస్తాన్ కట్టు కథలు చెబుతోంది. దీన్ని ఎప్పటికప్పుడు భారత్ తిప్పి కొడుతోంది. తాజాగా కజకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఆరో సీఐసీఏ సమ్మిట్ లో తన వక్రబుద్ధి బయటపెట్టింది పాకిస్తాన్. దీనికి ప్రతిగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి(స్వతంత్ర హోదా) మీనాక్షీ లేఖి గట్టిగానే సమాధానం ఇచ్చారు.

పాకిస్తాన్ లోని మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన ప్రార్థనా స్థలాలపై తరుచుగా దాడులు జరుగుతున్నాయని.. లెక్కలేనన్ని కిడ్నాప్ కేసులు నమోదు అవుతున్నాయని.. పాకిస్తాన్ లోని మైనారిటీ బాలికను బలవంతంగా కిడ్నాప్ చేసి వివాహం చేసుకుని మతం మారుస్తున్నారని దుయ్యబట్టారు మీనాక్షీ లేఖి. పాకిస్తాన్ దుర్భల స్థితికి ఇవి నిదర్శనాలు అని ఆమె అన్నారు.

Read Also: Delhi liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అభిషేక్ రావు కస్టడీ పొడగింపు.

జమ్మూ కాశ్మీర్ పై మాట్లాడటానికి పాకిస్థాన్‌కు ఎలాంటి అధికారం లేదని ఆమె అన్నారు. పాక్ ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రంగా ఉందని.. పాకిస్తాన్ తన ఉగ్రవాదా మౌళిక సదుపాయాలను మూసివేయాలని అన్నారు. మేము పాకిస్తాన్ తో సహా అన్ని పొరుగు దేశాలతో సంబంధాలను కోరకుంటున్నామని అన్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా తప్పుడు పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తుందని.. సభ్యుల దృష్టిని మరల్చేందుకు పాకిస్తాన్ మరోసారి సీఐసీఏ వేదికను దుర్వినియోగం చేయడం దురదృష్టకరమని ఆమె అన్నారు. సెప్టెంబర్ 1999 నాటి సీఐసీఏ సభ్యదేశాల మార్గదర్శకాలకు విరుద్ధంగా భారత అంతర్గత వ్యవహారాలు, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటుందని విమర్శించారు.

Exit mobile version