Site icon NTV Telugu

Russia-Ukraine War: మెక్‌డొనాల్డ్స్ కొత్తపేరుతో రీఎంట్రీ.. ఎగబడిన జనం

Mcdonalds

Mcdonalds

ప్రముఖ ఫాస్ట్​ఫుడ్​ దిగ్గజం మెక్​డొనాల్డ్స్.. ఉక్రెయిన్​పై రష్యా దాడులను నిరసిస్తూ రష్యాలో తమ సంస్థ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు మార్చిలో​ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పుడు మూతబడ్డ ప్రఖ్యాత ఫాస్ట్‌ఫుడ్‌ చెయిన్‌ మెక్‌డొనాల్డ్స్‌ రెణ్నెల్ల తర్వాత మళ్లీ తెరుచుకుంది. రష్యాలో మెక్​డొనాల్డ్స్​ యాజమాన్య హక్కులను స్థానిక వ్యాపారవేత్త అలెగ్జాండర్ గోవర్‌ కొనుగోలు చేశారు. తాజాగా ఆదివారం మాస్కోలో సరికొత్త పేరుతో మెక్​డొనాల్డ్స్​ను పునఃప్రారంభించారు.

దిగ్గజ ఫాస్ట్​పుడ్​ సంస్థ మెక్​డొనాల్డ్​.. రష్యాలో తన కార్యకలాపాలను కొత్త పేరుతో ఆదివారం ప్రారంభించింది. మాస్కోలోని పుష్కిన్ స్క్వేర్​లో రెస్టారెంట్ యజమాని అలెగ్జాండర్ గోవర్​’వుకోసో ఐ తోచ్కా’ అనే పేరుతో స్టోర్లను తెరిచారు. ఇంతకు ముందులానే మెక్​డొనాల్డ్స్​ను ఆదరించాలని వినియోగదారులను కోరారు అలెగ్జాండర్ గోవర్​. కొత్త లోగోను విభిన్నంగా తీర్చిదిద్దారు.

మెక్​డొనాల్డ్స్‌కు 850 రెస్టారెంట్లలో 62వేల మంది ఉద్యోగులు ఉన్నారు. దీంతో ఫిబ్రవరిలో ఉక్రెయిన్​పై యుద్ధం ప్రకటించిన నాటి నుంచి రష్యాను విడిచి వెళ్తున్న అతి పెద్ద పాశ్చాత్య సంస్థల జాబితాలో మెక్​డొనాల్డ్స్​ చేరినట్లు అయింది. సైబీరియాలో 25 ఫ్రాంచైజీలను కలిగి ఉన్న అలెగ్జాండర్ గోవర్‌కే తమ 850 రెస్టారెంట్‌లను విక్రయించింది మెక్​డొనాల్డ్స్. మూతపడిన మెక్​డొనాల్డ్స్​ బ్రాంచ్‌లను వేగంగా తెరవడానికి గోవర్​ ప్రయత్నిస్తున్నారు. అలెగ్జాండర్‌ నేతృత్వంలో రష్యాలో త్వరలో మెక్‌డొనాల్డ్స్​ రుచులు అందుబాటులో ఉండబోతున్నాయి. మూతబడ్డ 800 పై చిలుకు ఔట్‌లెట్లలో 200 దాకా నెలాఖరుకల్లా తెరుచుకుంటాయని యాజమాన్యం చెప్తోంది.

అయితే అంతకంటే ముందే రష్యా డేను పురస్కరించుకుని జూన్‌ 12న అధికారిక లోగోను రిలీజ్‌ చేశారు. గ్రీన్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక బర్గర్‌, రెండు ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ కనిపించేలా డిజైన్‌ చేసిన లోగోను విడుదల చేశారు. మెక్​డొనాల్డ్స్‌లో కోకకోలా నిల్వలు పరిమితంగా ఉన్నాయని అందుకే కొత్త కూల్ డ్రింక్స్​ కంపెనీని సంప్రదించనున్నట్లు అలెగ్జాండర్ తెలిపారు. 1991వ దశకంలో ప్రారంభమైన మెక్​డొనాల్డ్స్ మంచి ఆదరణ కలిగిన ఫాస్ట్​ఫుడ్ కంపెనీలలో ఒకటిగా నిలిచింది.

Exit mobile version