China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. 34 మంది మృతి
- చైనాను ముంచెత్తిన భారీ వరదలు
- 34 మంది మృతి, పలువురు గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాను భారీ వరదలు ముంచెత్తాయి. బీజింగ్, దాని సమీప ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో భారీ వరద ఇళ్లల్లోకి ప్రవేశించింది. దాదాపు ఇప్పటివరకు 34 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. ఇక రంగంలోకి దిగిన సహాయ బృందాలు 80 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాణనష్టాన్ని తగ్గించాలని అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికారులకు ఆదేశించారు.

Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
మంగళవారం అర్ధరాత్రి నుంచి భారీ ఎత్తున వర్షాలు కురిశాయి. దీంతో చెట్లు కూలిపోయాయి. విద్యుత్తు స్తంభాలు విరిగిపోవడంతో పలు ప్రాంతాలు చీకటిమయమయ్యాయి. ఇక కార్లు, బైక్‌లు వరదల్లో కొట్టుకుపోయాయి. మియున్ జిల్లాలో అర్ధరాత్రి నాటికి 28 మంది మరణించగా.. యాంకింగ్ జిల్లాలో మరో ఇద్దరు మరణించారని ప్రభుత్వ ప్రకటనలో తెలిపింది. మియున్‌లో దాదాపు 17,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది. పొరుగున ఉన్న హెబీ ప్రావిన్స్‌లోని లువాన్‌పింగ్ కౌంటీలోని గ్రామీణ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి నలుగురు మరణించారని తెలిపాయి . మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. కమ్యూనికేషన్లు నిలిచిపోయాయని, బంధువులను సంప్రదించలేకపోతున్నట్లు ఒక బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇది కూడా చదవండి: Trump: లండన్ మేయర్ దుష్టుడు.. బ్రిటన్ ప్రధాని పక్కన ఉండగానే ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు
మంగళవారం అర్ధరాత్రి నాటికి బీజింగ్‌లో సగటున 16 సెంటీమీటర్ల (6 అంగుళాలు) కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని, మియున్‌లోని రెండు పట్టణాల్లో 54 సెంటీమీటర్ల (21 అంగుళాలు) వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. మియున్‌లో 1959లో నిర్మించిన రిజర్వాయర్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. నదుల నీటి మట్టాలు పెరగడం, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Karnataka: ఓ అక్క మరణశాసనం.. వ్యాధి బయటకు తెలియకూడదని తమ్ముడు హత్య
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!