NTV Telugu Site icon

Mars: అంగారకుడిపైన ఒకప్పుడు పెద్ద సరస్సు ఉండేది.. నాసా రోవర్ కీలక ఆధారాలు..

Nasa Rover

Nasa Rover

Mars: సౌర కుటుంబంలో భూమి తర్వాత నివాసయోగ్యంగా ఉండే గ్రహాల్లో ముఖ్యమైంది అంగారకుడు. భూమి లాగే మార్స్ కూడా నివాసయోగ్యానికి అనువైన ‘గోల్డీ లాక్ జోన్’లో ఉంది. కొన్ని బిలియన్ ఏళ్ల క్రితం భూమి లాగే అంగాకరకుడు కూడా సముద్రాలు, నదులు, వాతావరణం కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అందుకనే అన్ని దేశాల అంతరిక్ష సంస్థలు మార్స్‌పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాయి.

తాజాగా నాసా ‘పర్సెవరెన్స్’ రోవల్ కీలక విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. అంగారకుడిపై ఒకప్పుడు జెరెజో క్రేటర్ నీటితో నిండి ఉండేదని, పురాతన సరస్సు అవక్షేపాల ఉనికిని రోవర్ గుర్తించింది. రోవర్‌లోని రోబోటిక్ చేయి మార్స్ భూభాగంలోకి చొచ్చుకుకెల్లి రాడార్ ద్వారా పరిశీలించిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో జీవానికి మార్స్ అనువుగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Read Also: Poorna: పూర్ణతో ఎఫైర్ అంటగడుతున్నారు.. డైరెక్టర్ బోల్డ్ కామెంట్స్

లాస్ ఏంజిల్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా (UCLA) మరియు యూనివర్శిటీ ఆఫ్ ఓస్లో బృందాల నేతృత్వంలోని పరిశోధన సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ఈ విషయాలు ప్రచురించబడ్డాయి. 2021లో పర్సెవరెన్స్ రోవర్‌ని నాసా మార్స్‌పైకి పంపంది. కారుపరిమాణంలో ఉండే ఈ రోవర్ జెరోజో క్రేటర్‌పై దిగి పరిశోధనలు చేస్తోంది. భూమిపై కనిపించే డెల్టాలు, నదిపాయలను సూచించే నీటి ఆనవాళ్లు అక్కడ కనిపించాయి. తాజాగా రోవర్ సేకరించిన అవక్షేపాలు దాదాపుగా 3 బిలియన్ల ఏళ్ల క్రితం ఏర్పడినట్లు భావిస్తున్నారు.

భూమి కన్నా తక్కువ పరిమాణం ఉండటం, బలమైన కోర్ లేకపోవడం లేకపోతే కాలక్రమేణా కోర్ చల్లబడి మాగ్నెటిక్ ఫీల్డ్ అంతరించి పోవడం వంటి కారణాల వల్ల మార్స్ తన వాతావారణాన్ని, నీటిని కోల్పోయినట్లు ఎక్కువ మంది సైంటిస్టులు భావిస్తున్నారు. బలమైన మాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోవడం వల్ల సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన కిరణాలతో మార్క్‌పై నీరు అంతరించిపోయిందని భావిస్తున్నారు.

Show comments