Mark Zuckerberg Gives Warning To Meta Directors Managers: గతేడాదిలోనే మెటా సంస్థ ఏకంగా 11 వేల ఉద్యోగుల్ని తొలగించి అందరినీ షాక్‌కి గురి చేసింది. ఇప్పుడు మార్క్ జుకర్‌బర్గ్ వ్యవహారశైలి చూస్తుంటే.. రానున్న రోజుల్లో మరిన్ని లేఆఫ్స్ ఉండనున్నట్టు తెలుస్తోంది. ఆయన తాజాగా కంపెనీలోని మేనేజర్లు, డైరెక్టర్లకు ఇచ్చిన వార్నింగే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. గత వారం కంపెనీలో ఓ అంతర్గత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జుకర్‌బర్గ్ మాట్లాడుతూ.. మేనేజర్లు, డైరెక్టర్లకు హెచ్చరికలు జారీ చేశారు. కేవలం సిబ్బందితో పని చేయించడమే కాకుండా, పనిలో వ్యక్తిగత పాత్ర ఉండాల్సిందేనని తీర్మానించారు. ఈ ఏడాది మరింత ఎఫీషియెన్సీ కనబరచాల్సిందేనని టార్గెట్ ఇచ్చారు. లేకపోతే.. రాజీనామా చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో.. మెటా ఉద్యోగుల్లో ఇప్పుడు లేఆఫ్ భయాందోళనలు అలుముకున్నాయి. కాగా.. గతేడాది ఉద్యోగుల్ని తొలగిస్తున్న సమయంలో.. మరింత ఎఫీషియన్సీ దిశగా పని చేయనున్నట్టు జుకర్‌బర్గ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే!
Twitter Blue: భారత్‌లోనూ బ్లూటిక్ వెరిఫికేషన్.. నెలవారీ రుసుం ఎంతంటే?
కాగా.. ఖర్చుల భారం తగ్గించుకోవడం కోసం ప్రైవేట్ సంస్థలు వరుసగా ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. కరోనా సమయంలో పని నిమితం ఎక్కువ ఉద్యోగుల్ని తీసుకున్న సంస్థలు.. ఇప్పుడు కాస్ట్ కటింగ్‌లో భాగంగా లేఆఫ్స్ ప్రారంభించాయి. గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలు కూడా ఈ లేఆఫ్ బాట పట్టిన సంగతి విదితమే. ఇదిలావుండగా.. జుకర్‌బర్గ్ ఇచ్చిన లేటెస్ట్ వార్నింగ్‌పై బ్లూమ్‌బర్గ్ ఒక నివేదిక జారీ చేసింది. ఇకపై మెటా కంపెనీలోని సీనియర్ మేనేజర్లు సైతం కింద స్థాయి ఉద్యోగులతో కలిసి తప్పకుండా పనిచేయాల్సి ఉంటుంది. కోడింగ్, డిజైనింగ్, రీసెర్చ్ వంటి వాటిపై దృష్టి పెట్టాల్సిందే! అలా కాకుండా కేవలం ఇన్‌చార్జ్‌లుగా ఉంటామంటే మాత్రం కుదరదు. నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల నుంచి తొలగించేస్తారు. ఆల్రెడీ ఉద్యోగుల పనితీరుపై కంపెనీలో నిరంతర సమీక్షలు కొనసాగుతున్నాయని తెలిసింది. ఈ సమీక్షల్లో భాగంగా.. పెర్ఫార్మెన్స్‌ని బట్టి ఉద్యోగుల్ని తొలగించాలా? లేదా? అనేది తుది నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి.. ఇకనుంచి అందరూ మెడలు వంచి పని చేయాల్సిందే!
Kakani Govardhan Reddy: కాకాణి స్ట్రాంగ్ కౌంటర్.. కోటంరెడ్డి ద్రోహం చేశాడు