Site icon NTV Telugu

Nobel Prize: నార్వేలో నోబెల్‌ అవార్డ్స్ ప్రదానోత్సవం.. హాజరుకాని మచాడో!

Maria Corina Machado

Maria Corina Machado

ఈ ఏడాది అనూహ్యంగా నోబెల్ శాంతి బహుమతి వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడోను వరించింది. కానీ మచాడోకు విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. మచాడోపై వెనిజులా దేశం ఆంక్షలు విధించింది. దీంతో ఆమె అవార్డు అందుకోలేని పరిస్థితి ఏర్పడింది. బుధవారం నార్వే రాజధాని ఓస్లోలో నోబెల్ బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతోంది. అయితే ఈ కార్యక్రమానికి మచాడో హాజరుకాలేన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మచాడో రాకపోవడంతో మీడియా సమావేశం రద్దైంది.

ఇది కూడా చదవండి: Gujarat: సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం.. టెక్స్‌టైల్ షాపులో పెద్ద ఎత్తున మంటలు

మచాడో ప్రస్తుతం వెనిజులాలో అజ్ఞాతంలో ఉన్నారు. అయితే అవార్డు తీసుకునేందుకు దేశం దాటి వెళ్తే పరారీలో ఉన్న నేరస్థురాలిగా పరిగణిస్తామంటూ వెనిజులా అటార్నీ జనరల్ హెచ్చరించారు. దీంతో మచాడో అవార్డు తీసుకునేందుకు నార్వే వెళ్లలేనట్లుగా తెలుస్తోంది. అయితే ఆమె వస్తారంటూ నోబెల్ నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: JD vance-Usha: రెస్టారెంట్‌లో జేడీవాన్స్-ఉషా వాన్స్ ఘర్షణ.. ఫొటో వైరల్!

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ గంపెడాశలు పెట్టుకున్నారు. 8 యుద్ధాలు ఆపిన తనకు నోబెల్ శాంతి బహుమతి రావడం ఖాయమని భావించారు. చివరికి నిరాశ ఎదురైంది. అనూహ్యంగా వెనిజులా విపక్ష నేత మచాడోను అవార్డు వరించింది. మొత్తానికైతే ట్రంప్ ఆశ ఫలించింది. ఇటీవలే ఫిఫా శాంతి బహుమతి వరించింది. తొలి ఫిఫా శాంతి బహుమతిని ట్రంప్‌కు అందజేస్తున్నట్లు ఫిఫా కమిటీ అధ్యక్షుడు ప్రకటించారు.

Exit mobile version