Site icon NTV Telugu

Marco Rubio: బందీలను విడిపించడమే లక్ష్యం.. నెక్ట్స్ ప్లానేంటో ఇంకా తెలియదు.. గాజాపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు

Marco Rubio

Marco Rubio

గాజాలో ఇంకా యుద్ధం ముగియలేదని.. బందీలను బయటకు తీసుకురావడమే తన తొలి ప్రాధాన్యత అని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడారు. ట్రంప్ ప్రణాళికకు, బందీలను విడుదల చేయడానికి హమాస్ ప్రాథమికంగా అంగీకరించిందని.. సమాచారం సమన్వయం చేసుకోవడానికి సమావేశాలు జరుగుతున్నాయ తెలిపారు. హమాస్ దగ్గర ఉన్న బందీలను విడుదల చేయడమే మొదటి దశ అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అనేదానిపై వివరాలు ఇంకా చర్చించుకోవాల్సి ఉందని చెప్పారు.

ఇది కూడా చదవండి: Trump: గాజాలో అధికారాన్ని విడిచిపెట్టండి.. లేదంటే నాశనం అవుతారు.. హమాస్‌కు మరోసారి ట్రంప్ హెచ్చరిక

ఇదిలా ఉంటే హమాస్‌కు ట్రంప్ విధించిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి హమాస్‌ను ట్రంప్ హెచ్చరించారు. గాజాలో అధికారాన్ని విడిచిపెట్టకపోతే పూర్తిగా నిర్మూలం అవుతారని వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే నరకం చూస్తారని హమాస్‌ను ఇటీవల ట్రంప్ హెచ్చరించారు. దీంతో శుక్రవారం రాత్రి ట్రంప్ ప్రణాళికలోని కొన్ని అంశాలకు అంగీకారం తెల్పుతున్నట్లు హమాస్ ప్రకటించింది. బందీలందరినీ ఒకేసారి విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు హమాస్ బందీలను విడిచిపెట్టలేదు.

ఇది కూడా చదవండి: Tejashwi Yadav: నితీష్‌కుమార్‌ ఆరోగ్యంగా ఉన్నారో లేదో అనుమానం.. వీడియో విడుదల చేసిన తేజస్వి యాదవ్

తాజాగా అమెరికా(వాషింగ్టన్) కాలమానం ప్రకారం.. ట్రంప్ విధించిన గడువు మరో 12 గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరోసారి హమాస్‌ను ట్రంప్ హెచ్చరించారు. గాజాలో శాంతి ప్రణాళికను అమలు చేసే భాగంగా గాజాపై అధికారాన్ని, నియంత్రణను వదులుకోవడానికి నిరాకరిస్తే మాత్రం హమాస్ పూర్తిగా నిర్మూలించబడుతుందని హెచ్చరించారు. గాజాలో బాంబ్ దాడులు నిలిపివేసేందుకు ఇజ్రాయెల్ కట్టుబడి ఉందని తెలిపారు. ఇక హమాస్ శాంతికి కట్టుబడి ఉందో లేదో త్వరలో తెలుసుకుంటానన్నారు.

గాజాలో శాంతి కోసం ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళికను హమాస్ ముందు పెట్టారు. దీనికి ఇజ్రాయెల్ అంగీకారం తెలిపింది. అలాగే ఆయా దేశాలు ట్రంప్ ప్లాన్‌ను స్వాగతిచారు. కానీ హమాస్ స్పందించలేదు. దీంతో శుక్రవారం హమాస్‌ను ట్రంప్ హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు శాంతి ఒప్పందానికి రాకపోతే నరకం చూస్తారని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి హమాస్ అంగీకారం తెలిపింది. అయితే తక్షణమే బందీలను విడుదల చేయాలని ఇజ్రాయెల్ కోరింది. కానీ ఇప్పటి వరకు మాత్రం బందీలను విడుదల చేయలేదు. సోమవారం విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version