Site icon NTV Telugu

US: అమెరికాలో ఫైర్ బాంబ్ దాడి.. పలువురికి గాయాలు.. నిందితుడు పాలస్తీనా నినాదాలు

Us

Us

అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి ఇజ్రాయెల్ వ్యతిరేకంగా బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ సందర్భంగా నిందితుడు పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేశాడు. పాలస్తీనాను విడిపించాలని డిమాండ్ చేశాడు.

ఇది కూడా చదవండి: Vidya Balan : ఇండస్ట్రీలో అలా అయితేనే కెరీర్ ఉంటుంది..

బౌల్డర్ నగరంలో ఒక వ్యక్తి ఇంట్లో తయారు చేసిన మోలోటోవ్ కాక్‌టెయిల్ బాంబును విసిరాడు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. వెంటనే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిందితుడు పాలస్తీనాను విడిపించాలని డిమాండ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలో నిందితుడు చొక్కా లేకుండా చేతుల్లో సీసాలు పట్టుకుని ఉన్నాడు. గడ్డి కాలిపోవడంతో వేగంగా నడుస్తున్నట్టు కనిపించాడు.

ఇది కూడా చదవండి: JEE Advanced 2025 Results: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. స్కోర్‌కార్డ్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

ఇక ఈ ఘటనను ఎఫ్‌బీఐ డైరెక్టర్ ఉగ్ర దాడిగా అభివర్ణించారు. యూదులు లక్ష్యంగా ఈ దాడి జరిగిందని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్ పేర్కొ్న్నారు. ఈ సంఘటన గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సమాచారం అందించినట్లు వైట్ హౌస్ తెలిపింది. ఇక ఈ సంఘటనపై ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హమాస్ చెరలో ఉన్న బందీలను తీసుకురావాలని యూదులు కవాతు చేస్తుండగా ఈ దాడి చేయడం దారుణం అన్నారు. ఇక అమెరికాలో ఉగ్రవాదానికి స్థానం లేదని రూబియో అన్నారు.

ఇటీవల వాషింగ్టన్‌లో యూదు మ్యూజియం వెలుపల ఇద్దరు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సిబ్బందిపై కాల్పులకు తెగబడగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుండగా ఈ ఘటన జరిగింది. అప్పుడు కూడా నిందితుడు పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేశాడు. 31 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

 

Exit mobile version