NTV Telugu Site icon

Plane Crashed: కుప్పకూలిన మనంగ్ ఎయిర్ హెలికాప్టర్.. పైలట్ ఏమయ్యాడంటే

Untitled 2

Untitled 2

Plane Crashed: శనివారం నేపాల్‌లో మనంగ్ ఎయిర్ హెలికాప్టర్ కుప్పకూలింది. వివరాలలోకి వెళ్తే. ప్రయాణికులను ఎక్కించుకోవడం కోసం ఎవరెస్ట్ బేస్ క్యాంపు సమీపం లోని లుక్లా నుంచి హెలికాప్టర్ 9N ANJ నేపాల్‌ లోని లోబుచే బయలుదేరింది. కాగా నేపాల్‌లోని లోబుచేలో ల్యాండ్ అయ్యే సమయంలో బోల్తా పడింది. దీనితో హెలికాప్టర్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన గురించి నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథ్ నిరౌలా మాట్లాడుతూ.. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ కుప్పకూలిందని, దీనితో హెలికాప్టర్ లో మంటలు వచ్చాయని తెలిపారు. అయితే హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సమయంలో ప్రయాణికులు ఎవరు లేరని, కేవలం పైలట్ ప్రకాష్ సెధాయ్‌ మాత్రమే ఉన్నాడని, అతనికి ఈ ప్రమాదంలో గాయాలు అయ్యాయని తెలిపారు. గాయపడిన పైలెట్ ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

Read also:Trending News: నిస్వార్థ ప్రేమకు ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది?

మనంగ్ ఎయిర్ విమానయాన సంస్థని ఖాట్మండులో 1997లో స్థాపించారు. కాగా ఇది నేపాల్ పౌర విమానయాన అథారిటీ నియంత్రణలో నేపాల్ భూభాగంలో వాణిజ్య వాయు రవాణాలో హెలికాప్టర్లను నిర్వహిస్తుంది. అయితే ఈ సంస్థకి చెందిన హెలికాప్టర్ లు తరుచుగా ప్రమాదానికి గురవుతున్నాయి. జూలైలో సోలుఖుంబు జిల్లాలోని లిఖుపికే రూరల్ మునిసిపాలిటీకి చెందిన లంజురా దగ్గర మనంగ్ ఎయిర్ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. జూలై 11 వ తేదీన ఉదయం కెప్టెన్ చెట్ బహదూర్ గురుంగ్ మెక్సికోకి చెందిన ఐదుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కమ్యూనికేషన్ ను కోల్పోయింది. అనంతరం జిరి మరియు ఫప్లు మధ్య ఉన్న లామ్‌జురా లోని చిహందండ వద్ద క్రాష్ అయినట్లు కనుగొనబడింది.