America: విమానం ఇంజన్ మూలంగా వ్యక్తి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
America: ఈ మధ్య కాలంలో విమానాశ్రయాల్లో ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. అయితే విమానంలో సాంకేతిక లోపం రావడంతో అత్యవసరంగా ల్యాడింగ్ చేయాల్సి రావడం.. ఆ సమయంలో ప్రయాణీకులకు స్వల్ప గాయాలు కావడం సహజంగా జరుగుతున్నాయి. ఈ మధ్యనే ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు ఒకేసారి రావడంతో ప్రమాదం జరిగింది. ఒక విమానానికి సంబంధించిన రెక్క కొంత మేరకు విగిపోవడంతోపాటు రన్‌వేలో ఉన్న వారికి గాయాలయ్యాయి. అలాగే విమానాలు టేకాప్ అయిన తరువాత వాటిల్లో సాంకేతిక లోపాలు రావడంతో వాటిని దగ్గరలో ఉన్న విమానాశ్రయాల్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇపుడు అలాంటిదే ఒక ప్రమాదం జరిగింది. విమానం ఇంజన్ మూలంగా ఒక వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ ఊహిచని ఘటన అమెరికాలో జరిగింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
Read also: Heart Health: మందార పూలను ఇలా తీసుకుంటే చాలు.. వందేళ్ల ఆయుష్షు..
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
డెల్టా ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానం జూన్ 23న రాత్రి 10.25 గంటల సమయంలో లాస్ ఎంజెల్స్ నుంచి టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఎరైవల్ గేట్ వద్దకు చేరిన ఆ విమానంలోని ఒక ఇంజన్ పనిచేస్తూనే ఉంది. ఇంజిన్ వేగం ప్రభావానికి అదే సమయంలో అటుగా వెళ్లిన ఉద్యోగి ఒకరిని ఇంజన్ లోపలికి లాగేసింది. అతడు చనిపోయినట్టు నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ ఏజెన్సీ(ఎన్టీఎస్బీ) తెలిపింది. ఈ ఘటనకు దారితీసని పరిస్థితులపై డెల్టా ఎయిర్ లైన్స్ అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే మృత్యువాత పడిన ఉద్యోగి వివరాలను సంస్థ వెల్లడించలేదు. విమానాశ్రయాల్లో హ్యాండ్లింగ్ కార్యకలాపాలకు కాంట్రాక్ట్ సేవలందించే యునిఫి ఏవియేషన్ సంస్థ అతడిని నియమించుకున్నట్టు తెలిసింది. కాగా గత ఏడాది అలబామా ఎయిర్‌పోర్టులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. విమానం ఇంజిన్ ఒక ఉద్యోగిని లోపలికి గుంజుకోవడంతో అతడు చనిపోయాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన అధికారులు ఇటీవల సదరు విమాన సంస్థకు రూ. 12.80 లక్షల జరిమానా విధించారు.
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!