NTV Telugu Site icon

America: విమానం ఇంజన్‌ మూలంగా వ్యక్తి మృతి

America

America

America: ఈ మధ్య కాలంలో విమానాశ్రయాల్లో ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. అయితే విమానంలో సాంకేతిక లోపం రావడంతో అత్యవసరంగా ల్యాడింగ్‌ చేయాల్సి రావడం.. ఆ సమయంలో ప్రయాణీకులకు స్వల్ప గాయాలు కావడం సహజంగా జరుగుతున్నాయి. ఈ మధ్యనే ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు ఒకేసారి రావడంతో ప్రమాదం జరిగింది. ఒక విమానానికి సంబంధించిన రెక్క కొంత మేరకు విగిపోవడంతోపాటు రన్‌వేలో ఉన్న వారికి గాయాలయ్యాయి. అలాగే విమానాలు టేకాప్‌ అయిన తరువాత వాటిల్లో సాంకేతిక లోపాలు రావడంతో వాటిని దగ్గరలో ఉన్న విమానాశ్రయాల్లో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇపుడు అలాంటిదే ఒక ప్రమాదం జరిగింది. విమానం ఇంజన్‌ మూలంగా ఒక వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ ఊహిచని ఘటన అమెరికాలో జరిగింది. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.

Read also: Heart Health: మందార పూలను ఇలా తీసుకుంటే చాలు.. వందేళ్ల ఆయుష్షు..

డెల్టా ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానం జూన్‌ 23న రాత్రి 10.25 గంటల సమయంలో లాస్‌ ఎంజెల్స్ నుంచి టెక్సాస్‌లోని శాన్‌ ఆంటోనియో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఎరైవల్‌ గేట్‌ వద్దకు చేరిన ఆ విమానంలోని ఒక ఇంజన్‌ పనిచేస్తూనే ఉంది. ఇంజిన్‌ వేగం ప్రభావానికి అదే సమయంలో అటుగా వెళ్లిన ఉద్యోగి ఒకరిని ఇంజన్‌ లోపలికి లాగేసింది. అతడు చనిపోయినట్టు నేషనల్‌ ట్రాన్స్ పోర్టేషన్‌ సేఫ్టీ ఏజెన్సీ(ఎన్‌టీఎస్‌బీ) తెలిపింది. ఈ ఘటనకు దారితీసని పరిస్థితులపై డెల్టా ఎయిర్‌ లైన్స్ అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే మృత్యువాత పడిన ఉద్యోగి వివరాలను సంస్థ వెల్లడించలేదు. విమానాశ్రయాల్లో హ్యాండ్లింగ్‌ కార్యకలాపాలకు కాంట్రాక్ట్ సేవలందించే యునిఫి ఏవియేషన్‌ సంస్థ అతడిని నియమించుకున్నట్టు తెలిసింది. కాగా గత ఏడాది అలబామా ఎయిర్‌పోర్టులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. విమానం ఇంజిన్‌ ఒక ఉద్యోగిని లోపలికి గుంజుకోవడంతో అతడు చనిపోయాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన అధికారులు ఇటీవల సదరు విమాన సంస్థకు రూ. 12.80 లక్షల జరిమానా విధించారు.