మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు అక్టోబర్ రెండో వారంలో భారత్‌లో పర్యటిస్తున్నారు. మాల్దీవుల అధికారిక వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఆయన ప్రధాని మోడీతో చర్చించనున్నట్లుగా వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: Crime: స్నానం చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్.. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష
ఇరు దేశాల మధ్య దౌత్య విభేదాలు తలెత్తాయి. భారత్ టూరిజంపై అక్కడి మంత్రులు నోరుపారేసుకున్నారు. దీంతో ఇరుదేశాల మధ్య విభేదాలు తలెత్తడంతో భారతీయులు మాల్దీవులు వెళ్లడం మానేశారు. దీంతో అక్కడ పర్యాటకం దెబ్బతింది. అనంతరం మాల్దీవులు బుజ్జగింపుల పర్వానికి దిగింది. ఇక మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు భారత్ వచ్చారు. మరోసారి ముయిజ్జు భారత్‌కు రావడం ఇది రెండోసారి. అక్టోబర్ 7-9 తేదీల్లో ముయిజ్జు భారత పర్యటనకు రానున్నారని, 8వ తేదీన ప్రధాని మోడీ, ఇతర అధికారులతో చర్చలు జరపనున్నారని సమాచారం. ఇరుదేశాల సత్సంబంధాల బలోపేతంతో పాటు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఇతర విషయాల గురించి ప్రధాని మోడీతో చర్చించనున్నారని సంబంధింత వర్గాలు పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: Jani Master Wife: నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు.. అంతా కుట్ర!
అమెరికా పర్యటనలో ఉన్న ముయిజ్జు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ప్రధాని మోడీని అవమానించినందుకు డిప్యూటీ మంత్రులపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. ‘‘ఎవరూ అలాంటి మాటలు అనకూడదు.. దానికి వ్యతిరేకంగా నేను చర్య తీసుకున్నాను. నాయకుడైనా, సాధారణ వ్యక్తి అయినా ఎవరినీ అలా దూషిస్తే నేను అంగీకరించను. ప్రతి మనిషికీ పేరు ఉంటుంది’’ అని ఆయన అన్నారు.