మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు భారత్ పర్యటనకు వస్తున్నారు. ద్వైపాక్షిక సంబంధాల కోసం ఆయన ఇండియాలో తొలి పర్యటన చేయబోతున్నారు. జూన్‌లో ప్రధాని మోడీ ప్రమాణస్వీకారానికి వచ్చి వెళ్లిపోయారు. ఇప్పుడు ద్వైపాక్షిక సంబంధాల కోసం భారత్‌లో పర్యటించబోతున్నారు. అక్టోబర్ 6 నుంచి 10 వరకు ఇండియాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా భారత్‌లోని పలు ప్రాంతాలను సందర్శించనున్నారు.
ఇది కూడా చదవండి: Samantha: కొండాసురేఖ ఆరోపణలు.. అమ్మవారి సేవలో సమంత
ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటన తర్వాత మాల్దీవుల మంత్రులు ఇష్టానుసారంగా నోరుపారేసుకున్నారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోయాయి. అంతేకాకుండా భారతీయులు మాల్దీవులు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు. అప్పటినుంచి మాల్దీవుల పర్యాటకం తీవ్రంగా దెబ్బతింటూ వస్తుంది. అంతేకాకుండా ముయిజ్జు.. చైనాకు అనుకూలంగా వ్యవహరించడం కూడా భారతీయులకు రుచించలేదు. దీంతో మాల్దీవుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక గత్యంతరం లేక ముయిజ్జు భారత్‌తో సంబంధాలు పెంచుకునేందుకు తహతహలాడుతున్నారు. దాదాపు ఐదు రోజుల పర్యటన కోసం ముయిజ్జు భారత్‌కు వస్తున్నారు. ఈ పర్యటనలో ప్రాముఖ్యంగా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.
ఇది కూడా చదవండి: Boycott Swiggy in AP: బాయ్‌కాట్ స్విగ్గీ..! హోటల్స్ అసోసియేషన్ నిర్ణయం
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు అక్టోబర్ 6 నుంచి 10 వరకు భారత్‌లో పర్యటించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. భారత్‌లో తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదేనని పేర్కొంది. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా సమావేశమం కానున్నారు. పర్యటనలో ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ప్రధాని మోడీతో ముయిజ్జు చర్చలు జరపనున్నారు. ఇక వ్యాపార కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ముంబై, బెంగళూరు ప్రాంతాలను కూడా సందర్శిస్తారు.
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల మాల్దీవులను సందర్శించారు. అధ్యక్షుడు ముయిజ్జు గత సంవత్సరం నవంబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్ నుంచి ఇదే తొలి పర్యటన. ఇరు దేశాల సంబంధాలపై చర్చించారు. ఇరు దేశాలు అభివృద్ధి సహకారాన్ని పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Haryana Polls: రేపే హర్యానా పోలింగ్.. లోక్‌సభ ఎన్నికల తర్వాత రసవత్తర పోరు