NTV Telugu Site icon

Malala: 13 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై అడుగుపెట్టిన నోబెల్ గ్రహీత మలాలా

Malala

Malala

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మహిళా హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ బుధవారం పాకిస్థాన్‌లోని తన సొంత గడ్డపై అడుగుపెట్టింది. 13 ఏళ్ల తర్వాత ఆమె తన స్వస్థలానికి తిరిగి వచ్చింది. ఆమె తండ్రి, భర్త, సోదరుడు హై సెక్యూరిటీ మధ్య పాక్‌కు చేరుకుంది. 15 ఏళ్ల వయసులో ఆమెపై తాలిబన్లు కాల్పులకు తెగబడ్డారు. స్వాత్ లోయలో ఉగ్రవాదులు బస్సు ఎక్కి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమె తలకు గాయాలయ్యాయి.

ఇది కూడా చదవండి: YouTube @ 20: 20 ఏళ్ల యూట్యూబ్.. దీని చరిత్ర మీకు తెలుసా..!

హెలికాప్టర్‌లో ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని షాంగ్లా జిల్లాలోని బర్కానాకు చేరుకుంది. అక్కడ ఆమె కుటుంబ సభ్యులను కలుసుకుంది. ఇటీవల ఇస్లామాబాద్‌లో ఆమె మామ గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారు. అతడిని కూడా పరామర్శించింది. అలాగే పూర్వీకుల స్మశానవాటికను కూడా సందర్శించిందని ది డాన్ వార్తాపత్రిక తెలిపింది. అలాగే బాలికల కోసం నిర్మించిన పాఠశాలను కూడా ఆమె సందర్శించింది. ప్రమాదం జరిగిన తర్వాత మలాలా తన సొంతూరు సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇది కూడా చదవండి: Nani : ‘ది ప్యారడైజ్’ లో నాని రెండు జడల వెనుక రహస్యం ఇదే..!

ఇక 2021లో అసీర్ మాలిక్‌ను మలాలా వివాహం చేసుకుంది. 2018లో బర్కానా జిల్లాలో సుమారు వెయ్యి మంది బాలికలకు ఉచిత విద్యను అందించేందుకు పాఠశాలను ఆమె నిర్మించింది. పాఠశాలలో విద్యార్థులను, తరగతి గదులను సందర్శించారు. మలాలా ఫండ్‌తో ఉచిత విద్యను అందిస్తోంది.

కాల్పులకు గురైన తర్వాత మలాలా తొలిసారి 2018లో పాకిస్తాన్‌ను సందర్శించింది. ఆ తర్వాత ఆమె 2022లో పాకిస్తాన్‌ను సందర్శించి వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను సందర్శించి బాధితులను ఓదార్చారు. ఇక ఈ సంవత్సరం జనవరిలో ఇస్లామాబాద్‌లో జరిగిన ముస్లిం సమాజంలో బాలికల విద్యపై అంతర్జాతీయ సమావేశంలో పాల్గొంది. అయితే సొంత గడ్డపై మాత్రం 13 ఏళ్ల తర్వాత అడుగుపెట్టింది.

ఇది కూడా చదవండి: Udhayanidhi Stalin: సనాతన ధర్మం వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో ఉదయనిధి స్టాలిన్‌‌కి ఊరట